బిగ్ బాస్ సీజన్ 7లో స్టార్ మా సీరియల్ బ్యాచ్ గా అడుగుపెట్టిన అమర్ దీప్, శోభా శెట్టి, ప్రియాంక లు మొదటి నుంచి స్నేహంగానే ఉంటున్నారు. శోభా కెప్టెన్ అవవడం కోసం అమర్ దీప్ కష్టపడితే, శోభా శెట్టిని ఓ టాస్క్ లో అవుట్ అవ్వకుండా ప్రియాంక చూసుకుంది. అలాగే అమర్ దీప్ కి అండగా ప్రియాంక, శోభా శెట్టి అడుగడుగునా నిలుస్తున్నారు. వీరిని స్టార్ మా సీరియల్ బ్యాచ్ అంటూ బయట నెటిజెన్స్, లోపల శివాజి పేరు పెట్టుకున్నారు. శివాజీకైతే ఈ ముగ్గురిని చూస్తే కాలుతూ ఉంటుంది. వీరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వాలని శివాజీ ట్రై చేస్తూనే ఉన్నాడు. కాని స్టార్ మా వీళ్ళని కాపాడుతుంది అంటూ బయట జనాలు మాట్లాడుకుంటున్నారు.
ఇక తాజాగా ఈ సీరియల్ బ్యాచ్ లో కొట్లాట ఈ రోజు ఎపిసోడ్ లో హైలైట్ అయ్యింది. డైరెక్ట్ గా ఫైనల్స్ కి చేరేందుకు బిగ్ బాస్ పలు టాస్క్ లు పెడుతుండగా అందులో ముందు టాస్క్ లో ఓడిపోయిన శివాజీ, శోభా శెట్టిలు తమ పాయింట్స్ ని అమర్ దీప్ కి ఇచ్చేసారు. ఇక తర్వాత టాస్క్ లో ఓడిపోయిన పల్లవి ప్రశాంత్, యావర్ లు తమ పాయింట్స్ ని ఎవరికో ఒకరికి ఇవ్వమన్నాడు బిగ్ బాస్. అలాగే ప్రియాంక ని కూడా తన పాయింట్స్ ఎవరికైనా ఇచ్చెయ్యమని చెప్పగానే ప్రియాంక తనని కెప్టెన్సీటాస్క్ లో సపోర్ట్ చేసిన గౌతమ్ పేరు చెప్పింది, దానితో అమర్ దీప్ ఫీలైపోయాడు.
ప్రియాంక ఏం చెప్పిన అమర్ వినలేదు. నేను నీకు కనిపించలేదా.. నేను వెధవనైపోయానుగా, నాకు ఇవ్వాలని లేదా అంటూ అమర్ ప్రియాంకని అడిగాడు. ప్రియాంక నాకు గౌతమ్ కెప్టెన్సీ టాస్క్ లో హెల్ప్ చేసాడు.. అందుకే గౌతమ్ కి ఇచ్చాను అని చెప్పినా ఇదేనా ఫ్రెండ్ షిప్ అంటూ అమర్ మాట్లాడిన మాటలతో ప్రియాంక చాలా ఫీలయ్యింది. ఈ ఫైనల్ టాస్క్ లో ప్రియాంక-అమర్ దీప్ మధ్యన ఫైట్ జరిగింది. మరి సీరియల్ బ్యాచ్ మధ్యన కూడా బిగ్ బాస్ కుంపటి పెట్టేసాడు.