Advertisementt

మహేష్ ఫాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్

Sun 03rd Dec 2023 09:57 AM
guntur kaaram  మహేష్ ఫాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్
Crazy update on Guntur Kaaram మహేష్ ఫాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్
Advertisement
Ads by CJ

గుంటూరు కారం పై నిర్మాత ఎంత కాన్ఫిడెంట్ గా సంక్రాంతికే రిలీజ్ అని చెబుతున్నా మహేష్ అభిమానుల్లో ఎక్కడో ఏదో అనుమానం. ఇప్పటివరకు షూటింగ్ ఓ కొలిక్కి రాలేదు, త్రివిక్రమ్ ని నమ్ముకుంటే పని జరుగుద్దా అని వారు ఆందోళన పడని రోజు లేదు. దమ్ మసాలా వదిలారు.. గత వారం గుంటూరు కారం సెకండ్ సింగిల్ అన్నారు, దాని ముచ్చట లేదు. నిర్మాత నాగ వంశి ఎట్టి పరిస్థితుల్లో గుంటూరు కారం సంక్రాంతికే రిలీజ్ అంటున్నారు. షూటింగ్ అప్ డేట్ ఉండడం లేదు.

మహేష్, త్రివిక్రమ్ లు కామ్ గా ఉంటున్నారు. అయితే తాజాగా ఇప్పుడు మహేష్ ఫాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్ ఒకటి బయటికి వచ్చింది. డిసెంబర్ 25 తో గుంటూరు కారం షూటింగ్ వర్క్ అయిపోతుందని అంటున్నారు. షూటింగ్ పూర్తి కాగానే  మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు విదేశాలకి వెళ్తారు. ఒకవేళ చిన్న చిన్న ప్యాచ్ వర్క్ లు ఏమైనా వుంటే ఆ లాస్ట్  వీక్ లో ఫినిష్ చేస్తారంటూ సోషల్ మీడియాలో వేసిన ట్వీట్ చూసి అభిమానులు రిలాక్స్ అవుతున్నారు.

ఈ లెక్కన ఖచ్చితంగా గుంటూరు కారం పండక్కి రావడం పక్కానే. ఇక గుంటూరు కారం ప్రమోషన్స్ కూడా మెల్లగా మొదలు పెట్టేస్తారని తెలుస్తోంది. పాటలు, ఆ తర్వాత ట్రైలర్ ఇలా వరసగా గుంటూరు కారం ప్రమోషన్స్ ఉండబోతున్నాయని సమాచారం. 

Crazy update on Guntur Kaaram :

Guntur Kaaram shooting update

Tags:   GUNTUR KAARAM
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ