తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. దాదాపు ఫలితం అయితే తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా దూసుకుపోతోంది. అయితే ఇక్కడ రౌండ్ రౌండ్‌కీ ఫలితం మారిపోతోంది. మొదట పక్కాగా కాంగ్రెస్‌కే ఫేవర్‌గా ఉండిన కౌంటింగ్ ఆ తరువాత మాత్రం మారిపోతూ వచ్చింది. కొంతకొంతలో బీఆర్ఎస్‌కు ఫేవర్‌గా మారింది. అయితే ఇరు పార్టీల ఫలితంలో వ్యత్యాసం అయితే చాలా ఉంది. ఇక తెలంగాణ ఎన్నికల తొలి ఫలితం వెలువడింది. అశ్వారావుపేట ఫలితం వచ్చేసింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణ విజయం సాధించారు.
నిజానికి ఖమ్మం జిల్లాలో ఆది నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ తన హవా కొనసాగిస్తోంది. జిల్లాలో క్లీన్ స్వీప్ చేసే దిశగా దూసుకెళుతోంది. గతంలో బీఆర్ఎస్‌కు ఇక్కడ ఏమాత్రం కేడర్ లేదు. ఆ తరువాత అన్ని నియోజకవర్గాల్లో నేతలు బీఆర్ఎస్‌లో చేరడం పూర్తిగా జిల్లా గులాబీ మయం అయిపోయింది. ఆ తరువాత మారుతున్న పరిణామాల్లో భాగంగా తొలుత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆ తరువాత మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారడంతో సీన్ పూర్తిగా కాంగ్రెస్‌కు ఫేమర్‌గా మారిపోయింది. గులాబీ పార్టీ ఇక్కడ దారుణంగా పతనమైంది.