తెలంగాణ ఎన్నికల్లో ప్రజలు తీర్పుని చెప్పేసారు. పదేళ్లుగా తెలంగాణాని పాలిస్తున్న కేసీఆర్ కుటుంబాన్ని ప్రగతి భవన్ నుంచి ఇంటికి తరిమేశారు. ఈ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కి పట్టం కట్టారు. రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ విజకేతనం ఎగరవేసింది. అయితే ఇక్కడ కాంగ్రెస్ గొప్ప కాదు, చంద్రబాబు మీద సానూభూతి అంతకంటే కాదు.. ప్రజలు పదేళ్లుగా ఒకే ప్రభుత్వాన్ని చూసి వారు మార్పుని కోరుకోబట్టే BRS ని ఓడించి కాంగ్రెస్ ని గెలిపించారు. ఎగ్జిట్ పోల్స్ లోను కాంగ్రెస్ కి, BRS కి స్పష్టమైన ఆధిక్యత రాదు అనే అన్నారు. అందుకే ఈ ప్రభుత్వానికి MIM ప్రముఖ పాత్ర పోషిస్తుంది అన్నారు. ఏది ఏమైనా ఈ ఎన్నికల్లో తెలంగాలో కాంగ్రెస్ స్పష్టమైన అధికత్యని మొదటి రౌండ్ నుంచి చూపిస్తూనే ఉంది.
ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీతో కాంగ్రస్ గెలిచింది. కాంగ్రెస్ లోని ముఖ్యనేతలంతా గెలిచారు, అటు BRS లో మంత్రులుగా చేసినవారు చాలామంది ఈ ఎన్నికల్లో ఓటమి చెందారు. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కి ప్రజలైతే పట్టం కట్టారు.. అందులో సీఎం గా ఎవరు చేస్తారో కొట్టుకు చావండి అని వదిలేసారు. ఎందుకంటే కాంగ్రెస్ కి దిశా నిర్దేశం చేసేది పైన ఉండే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. ఇక్కడ రేవంత్ రెడ్డి అయినా, భట్టి అయినా ఎవరైనా అధిష్టానం చెప్పినట్టే చెయ్యాలి. అసలే కాంగ్రెస్ లో ఐఖ్యత లేదు.
కుర్చీ కోసం నిత్యం కొట్లాటలు, సీనియర్ నాయకులెవ్వరూ రేవంత్ రెడ్డికి సపోర్ట్ చెయ్యరు. జగ్గారెడ్డి, హనుమంతరావు, జానారెడ్డి ఇలా ఎవ్వరూ రేవంత్ రెడ్డి ఆధిపత్యాన్ని ఒప్పుకోరు. సీఎం పీఠం కోసం బట్టి విక్రమార్క ఒంటరిగా పాద యాత్ర చేసాడు. అబ్బో కాంగ్రెస్ లో ఉన్న ప్రతి ఒక్కరూ సీఎం పీఠం కోసమే చూస్తారు. కోమటి రెడ్డి బ్రదర్స్ ఎప్పుడెలా ఉంటారో తెలియదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలా ఎవ్వరికి వారే పీఠం కోసం ఫైట్ చేస్తారు.
మరి ఇప్పడు కాబోయే సీఎం అని రేవంత్ రెడ్డిని అంటున్నా తర్వాత రేవంత్ పై కాంగ్రెస్ నాయకులూ తిరుగు బావుటా ఎగరెయ్యడం ఖాయం. అందుకే అనేది మేము గెలిపించాం, మీరు మీరు కొట్టుకు చావండి అని ప్రజలు అనేది.