తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ బావుటా ఎగరేసింది. కేసీఆర్, కేటీఆర్ పై ఉన్న ప్రజా వ్యతిరేఖత కాంగ్రెస్ కి కలిసొచ్చింది. పదేళ్లుగా దొరల పాలన అంటూ కాంగ్రెస్ చేసిన ప్రచారం ప్రజల్లో బాగా నాటుకుంది. అటు రాహుల్ గాంధీ, ఇటు ప్రియాంక గాంధీ తెలంగాణ కాంగ్రెస్ కి బాగా హెల్ప్ అయ్యారు. ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో కాంగ్రెస్ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. అయితే కాంగ్రెస్ లో ఎవరు సీఎం అవుతారో అనే విషయంలో చాలా సస్పెన్స్ వుంది. కారణం బయటి నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వొప్పుకునేందుకు కాంగ్రెస్ సీనియర్స్ సిద్ధంగా లేరు.
మరోవైపు మల్లు భట్టి వికమార్క నుంచి రేవంత్ రెడ్డికి గట్టిపోటీ ఉంది. మరి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా.. పదేళ్లుగా బూజు పట్టిన గాంధీ భవన్ దుమ్ము దులిపిన రేవంత్ రెడ్డికే సీఎం కుర్చీ ఇవ్వాలని తెలంగాణ ప్రజలు, కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు కోరుకుంటున్నారు. ప్రస్తుతం సీనియర్ నాయకులు సైలెంట్ గా ఉండడమే కాదు వీహెచ్ హనుమంతరావు రేవంత్ నే సీఎం కేండిడేట్ అంటూ ప్రకటించారు. ఇక అధిష్టానం కూడా రేవంత్ రెడ్డినే సీఎం ని చేయబోతుంది. భట్టి విక్రమార్కని డిప్యూటీ సీఎం గా ఉంచనుంది.
రేపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. హైదరాబాదు ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సీఎంగా రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. అటు కేసీఆర్ కూడా గవర్నర్ కి రాజీనామా లేఖని సమర్పించి ప్రవేట్ వాహనంలో ఆయన ఫ్యామిలీతో పాటుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి వెళ్లిపోగా.. కేటీఆర్ మాత్రం ఈ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముందుకు వచ్చారు.