బిగ్ బాస్ సీజన్ 7 లో రైతు బిడ్డగా మొదటి నుంచి ఆటతో పాటుగా సింపతిని క్రియేట్ చేసుకుని చివరికి స్ట్రాంగ్ ప్లేయర్ గా హౌస్ లో శివాజితో స్నేహం చేస్తూ టైటిల్ కి దగ్గరయిన పల్లవి ప్రశాంత్ అంటే హౌస్ లోనే కాదు నెటిజెన్స్ లోను కొంతమందికి నచ్చదు. అతని యాటిట్యూడ్ అంటే పడదు. ఆటల్లో ఓకె.. మిగతా విషయాల్లో పల్లవి ప్రశాంత్ ని చూస్తే చాలామంది చిరాకు పడుతున్నారు. నామినేషన్స్ లో మరింతగా పల్లవి ఓవరేక్షన్ కనిపిస్తుంది. అయితే తాజాగా పల్లవి ప్రశాంత్ గేమ్ మైండ్ చూసి మరీ ఇంత స్వార్ధపరుడా ఈ రైతు బిడ్డ అనే కామెంట్స్ రేజ్ చేస్తున్నారు.
కారణం ఏమిటంటే పల్లవి ప్రశాంత్ కష్టపడి ఆడి ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలుచుకున్నాడు. అది తనకి కానీ, లేదంటే హౌస్ మేట్స్ అంటే ఫ్రెండ్స్ లో ఎవరో ఒకరికి వాడే అవకాశం ఉంది. ఇక ఈవారం ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడకపోతే ఆ పాస్ ని వచ్చే వారం ఉపయోగించకూడదు అని నాగ్ చెప్పారు. ఈ వారం పల్లవి ప్రశాంత్-శోభా శెట్టి-గౌతమ్ లు చివరిగా డేంజర్ జోన్ లో ఉండగా పల్లవి ప్రశాంత్ ని నీ పాస్ వాడుతావా అని అడిగితే వద్దు సర్.. నాకు ప్రేక్షకుల సపోర్ట్ చాలు అన్నాడు. ఆ తర్వాత అతను సేవ్ అయ్యాడు. హ్యాపీ.
ఆ తర్వాత శోభా శెట్టికి కానీ, గౌతమ్ కి కానీ ఎవరో ఒకరి పాస్ ఇస్తావా అంటే లేదు సర్ వారిలో ఒకరికి ఇస్తే మరొకరు బాధపడతారంటూ తప్పించుకున్నాడు. అదే అక్కడ శివాజీ కానీ యావర్ కానీ ఉంటే ఖచ్చితంగా వాడేవాడు. అక్కడ ఉన్న శోభా, గౌతమ్ లు, అయితే మీరిద్దరిలో ఒకరు డిసైడ్ చేసుకోండి ఎవరికి ఆ పాస్ కావాలో అంటే వారు ఇద్దరూ వద్దన్నారు. అదే పల్లవి ప్రశాంత్ అక్కడ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఎవరికో ఒకరి వాడితే బావుండేది అని నెటిజెన్స్ అభిప్రాయం. ఫైనల్ గా గౌతమ్ ఎలిమినేట్ అయ్యాడు. రైతు బిడ్డ స్వార్ధం అందరికి అర్ధమైంది. ఎవిక్షన్ ఫ్రీ పాస్ వేస్ట్ అయ్యింది.