బిగ్ బాస్ సీజన్ 7 నామినేషన్స్ డే తప్ప మిగతా వారాల టాస్క్ లన్నీ చెత్తగా బోరింగ్ గా ఉన్నాయనే అభిప్రాయాలు బుల్లితెర ప్రేక్షకుల నుంచి వినిపిస్తుంది. ఇక హౌస్ లో నామినేషన్స్ వార్ అనేది ఈసీజన్ లో మరింత ఎక్కువగా ఉంది. గత మూడు వారాల వరకు సోమవారం, మంగళవారం నడిపించిన నామినేషన్స్.. కంటెస్టెంట్స్ తగ్గేసరికి ఒక్కరోజులో అంటే సోమవారంతో ముగించేస్తున్నారు. ఇక హౌస్ లో స్ట్రాంగ్ అయిన పల్లవి ప్రశాంత్ వ్యక్తిగతంగా యాటిట్యూడ్ చూపిస్తాడనే మాట మొదటి నుంచి వినిపిస్తుంది.
టాస్క్ పెరఫార్మెన్స్ లేదు, తెలివితేటలూ లేని అమర్ దీప్ ని ఇప్పటివరకు అంటే టాప్ 5 వరకు తీసుకురావడమే ప్రేక్షకులకి నచ్చలేదు. మొదటి వారం నుంచి అమర్ కి పల్లవి ప్రశాంత్ కి పడదు. మధ్యలో స్నేహం చేసినట్టుగా చూపించినా గత రెండు వారాలుగా అమర్ పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేస్తున్నాడు. ఇక ఈవారం నామినేషన్స్ లో పల్లవి ప్రశాంత్ vs అమర్ దీప్ అన్నట్టుగా కొట్టుకునే వరకు వెళ్లారు. ఒకొనొక సమయంలో వీరి గొడవ ఇంట్రెస్ట్ గా అనిపించడం అటుంచి చిరాకు తెప్పించింది.
ఆ అమర్ యాక్టింగ్, పల్లవి ఓవరేక్షన్ అన్ని విరక్తిని కలిగించాయి. యావర్ ని నామినేట్ చేసేటప్పుడు కూడా పల్లవి ప్రశాంత్ పేరు తియ్యగానే అమర్ పై పల్లవి దూసుకుపోయాడు. నేనంటే మొదటి నుంచి మీకు నచ్చదంటూ, నన్ను రా అనొద్దు నేను పలకను అని ప్రశాంత్, నేను ఇలానే పిలుస్తా నీ ఇష్టం పలుకు పలక్కపో అని అమర్ అబ్బో వారి మధ్యన నామినేషన్స్ రచ్చ చూసేవాళ్ళకి కూడా అసహ్యం కలిగింది.