Advertisementt

డెవిల్‌కి డేట్ ఫిక్సయింది

Fri 08th Dec 2023 11:48 AM
kalyan ram devil  డెవిల్‌కి డేట్ ఫిక్సయింది
Kalyan Ram Devil Movie Release Date Fixed డెవిల్‌కి డేట్ ఫిక్సయింది
Advertisement
Ads by CJ

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న పీరియాడిక్ స్పై థ్రిల్ల‌ర్ డెవిల్. మొదటి నుండి వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న కళ్యాణ్ రామ్.. చేస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్.. సినిమాపై క్రేజ్‌కు కారణమైంది. అలాగే లక్కీ హీరోయిన్ సంయుక్తా మీనన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండటంతో.. కచ్చితంగా ఈ సినిమా కూడా హిట్ అనేలా ఇప్పటికే టాక్ మొదలైంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు.

ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ అంటూ మేకర్స్ వదులుతున్న అప్‌డేట్స్‌తో.. సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ప్రేక్షకులు ఎదురుచూసేలా చేస్తుండగా.. ఈ సినిమాని డిసెంబర్ 29న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. విడుదల తేదీ తెలుపుతూ విడుదల చేసిన పోస్టర్ కూడా సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. కారణం ఇందులో కళ్యాణ్ రామ్ ఎన్ని రకాల పాత్రలలో కనిపించబోతున్నాడనేది క్లారిటీగా తెలియజేశారు. అలాగే హీరోయిన్ సంయుక్తా మీనన్‌ని కూడా వైవిధ్యంగా చూపించారు.

ఇందులో ఎవ‌రికీ అంతు చిక్క‌ని ఓ ర‌హ‌స్యాన్ని ఛేదించే బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ నటిస్తున్నారు. అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, త‌మిళ్‌, క‌న్న‌డ భాష‌ల్లో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం మేకర్స్ విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Kalyan Ram Devil Movie Release Date Fixed:

Devil Movie Release on Dec 29th

Tags:   KALYAN RAM DEVIL
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ