డిసెంబర్ 22 న రాబోతున్న సలార్ విషయంలోప్రభాస్ ఫాన్స్ లో ఇప్పుడు ఆందోళన పడడం లేదు, ఆందోళన స్థానంలో వారు రిలాక్స్ మోడ్ లో కనిపిస్తున్నారు. నిన్నమొన్నటివరకు షారుఖ్ డుంకి సినిమా సలార్ పై ఎక్కడ పై చెయ్యి సాధిస్తుందో.. అసలే రెండు బిగ్గెస్ట్ హిట్స్ తో ఉన్న షారుఖ్ డుంకి తో సలార్ ని ఢీ కొడుతున్నాడని అనుకున్నారు. ఇటు ప్రభాస్ వరస వైఫల్యాలతో సతమతమవుతున్నారు. అందుకే వారి ఆందోళన.
కానీ ఇప్పుడు ప్రభాస్ ఫాన్స్ కి ధీమా వచ్చేసింది. సోషల్ మీడియాలో కానీ, ఎక్కడ చూసినా సలార్ క్రేజ్ ముందు డుంకి తేలిపోతుంది. అడ్వాన్స్ బుకింగ్స్ లో సలార్ దూసుకుపోతుంది. ఆస్ట్రేలియా, అమెరికా ఇలా ఓవర్సీస్ లో ఎక్కడా చూసినా సలార్ హావనే కనిపిస్తుంది. అంతేకాకుండా డుంకి ట్రైలర్ సలార్ ట్రైలర్ ముందు తేలిపోయింది. డుంకి ట్రైలర్ చూసాక ఉన్న దానిపై అంచనాలు తగ్గాయి. ఎంత సక్సెస్ ఉన్న హీరో అయినా సినిమాపై అంచనాలుంటే ఓకె.. లేదంటే కష్టమే.
సలార్ ట్రైలర్ కు సైతం భీభత్సమైన రెస్పాన్స్ రాలేదు. అయినప్పటికీ ప్రస్తుతం సలార్ పై ఉన్న నెగిటివిటి దూరమవుతుంది. అయినా సలార్ డంకీ కంటే ఎన్నో రెట్లు మెరుగ్గా మాస్ ని ఆకట్టుకునేలా ఉండటం ఓపెనింగ్స్ కి దోహద పడేలా చేస్తోంది. ఇక ప్రభాస్ కూడా కల్కి షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుని వచ్చే వారం నుంచి జాయిన్ కాబోతున్నట్లుగా తెలుస్తుంది. ఒక్కసారి ప్రభాస్ ప్రమోషన్స్ కి వస్తే సలార్ పై హైప్ మరింతగా క్రియేట్ అవుతుంది. అందుకే ప్రభాస్ ఫాన్స్ కూల్ గా రిలాక్స్ అవుతున్నారు.