Advertisementt

చిరుపై కేసు-మొట్టికాయలు వేసిన కోర్టు

Mon 11th Dec 2023 09:49 PM
madras highcourt,mansoor ali khan  చిరుపై కేసు-మొట్టికాయలు వేసిన కోర్టు
Madras High Court slams Mansoor Ali Khan చిరుపై కేసు-మొట్టికాయలు వేసిన కోర్టు
Advertisement
Ads by CJ

త్రిష పై అనుచిత వ్యాఖ్యలు చేసి అడ్డంగా ఇరుక్కుని ఊపిరి ఆడక ఈ ఇష్యులో చివరికి త్రిషకి సారి చెప్పిన మన్సూర్ అలీ ఖాన్.. ఇప్పుడు పరువు నష్టం కేసు పెట్టి కోర్టులో మొట్టికాయలు మొట్టించుకున్నారు. త్రిషపై మన్సూర్ అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో త్రిషకి సపోర్ట్ గా మాట్లాడిన చిరంజీవి, ఖుష్బూ, త్రిష లాంటి సెలబ్రిటీస్ పై మన్సూర్ అలీ ఖాన్ పరువు నష్టం కేసు వేసి కోర్టుకెక్కాడు. చిరు లాంటి పెద్దమనిషి నా వీడియో సరిగా చూడకుండా మాట్లాడారు, తాను పార్టీ పెట్టి డబ్బు కోసం ఆ పార్టీ అమ్ముకున్నారంటూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడాడు.

ఇక చిరుపై, ఖుష్బూ, త్రిషపై పరువు నష్టం కేసు పెట్టి వారి పరువు తియ్యాలనుకున్న మన్సూర్ కి హై కోర్టు మొట్టికాయలు వేస్తూ ఆయన పరువునే తీసేసింది. మన్సూర్ పరువు నష్టం కేసుని విచారించిన హై కోర్టు.. తీర్పు నిస్తూ పబ్లిక్ ప్లాట్ ఫామ్ లో నీచమైన వ్యాఖ్యలు చేసినందుకు గాను త్రిషనే నీ మీద కేసు పెట్టాలి. మీకు వివాదాల్లో తలదూర్చడం అలవాటే. ప్రతిసారి అలా చెయ్యడం, ఆ తర్వాత నాకేమి తెలియదు అంటూ మీరు అమాయకంగా మాట్లాడడం అలవాటైపోయింది.. అంటూ చివాట్లు పెట్టింది.

మన్సూర్ కి వ్యతిరేఖంగా తీర్పు రావడం చూసిన నెటిజెన్స్.. మెగాస్టార్ లాంటి వారిపై కేసు వేస్తె ఈ మాత్రం చివాట్లు తినాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Madras High Court slams Mansoor Ali Khan:

Madras Highcourt slams actor Mansoor Ali Khan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ