కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ ఈ నెల 29 న విడుదలకు సిద్ధమవుతుండగా.. మేకర్స్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసారు. నిన్న మంగళవారం సాయంత్రం AMB లో డెవిల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తో ప్రమోషన్స్ కి శ్రీకారం చుట్టారు. ప్యాన్ ఇండియా మూవీగా విడుదల కాబోతున్న డెవిల్ మూవీలో కళ్యాణ్ రామ్ సరసన మరోసారి సంయుక్త మీనన్ నటిస్తుండగా.. మాళవిక నాయర్ కీలక పాత్రలో కనిపించనుంది.
అయితే ప్యాన్ ఇండియా స్థాయిలో డెవిల్ కి క్రేజ్ తీసుకురావాలంటే ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి యంగ్ టైగర్ గెస్ట్ గా తీసుకురావాలని ఎన్టీఆర్ అభిమానులు కోరుకుంటున్నారు. డెవిల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ వస్తే డెవిల్ పై ఆటోమాటిక్ గా క్రేజ్ వస్తుంది. దానితో విడుదల సమయానికి అంచనాలు పెరుగుతాయని వారి కోరిక. మరి అన్న కళ్యాణ్ రామ్ కోసం ఎన్టీఆర్ చాలారోజులుగా ఆయన సినిమా ఈవెంట్స్ కి గెస్ట్ గా హాజరవుతున్నారు.
అందుకే డెవిల్ కి కూడా ఎన్టీఆర్ గెస్ట్ గా రావొచ్చని తెలుస్తుంది. అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవర ప్రమోషన్స్ కన్నా ముందే ఎన్టీఆర్ ని కళ్యాణ్ రామ్ డెవిల్ ఈవెంట్ లో చూసి ఖుషి అవుతారన్నమాట.