కళ్యాణ్ రామ్ ప్యాన్ ఇండియా ఫిల్మ్ డెవిల్ ఆది నుంచి వివాదాల్లోనే కనబడుతుంది. ఈచిత్రాన్ని ఎప్పుడో నవంబర్ లోనే విడుదల చెయ్యాల్సి ఉంది.. ఇప్పడు ఈ చిత్రం డిసెంబర్ 29 కి పోస్ట్ పోన్ అయ్యింది. అయితే డెవిల్ మూవీ కి సంబంధించి సినిమా స్టార్ట్ అయినప్పుడు నవీన్ మేడారం దర్శకుడిగా సినిమా పట్టాలెక్కింది. డెవిల్ షూటింగ్ కంప్లీట్ అయ్యేలోపు నవీన్ మేడారం స్థానంలో నిర్మాత అభిషేక్ నామ పేరు వచ్చి చేరింది. దర్శకుడు నవీన్ కి నిర్మాతలకి వచ్చిన ఈగో క్లాషెస్ కారణంగా నవీన్ మేడారం ఈప్రాజెక్టు నుంచి తప్పుకోగా.. ఆ ప్లేస్ లో అభిషేక్ నామ తన పేరు వేసుకున్నారు.
ఇక ఇప్పుడు కొత్తగా డెవిల్ లో విలన్ గా నటించిన మార్క్.. డెవిల్ నిర్మాతలపై సెన్సేషనల్ కామెంట్స్ చెయ్యడం కాదు.. తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నాడు. అతను ఇన్స్టా వేదికగా పెట్టిన పోస్ట్ లో.. డెవిల్ షూటింగ్ మొదట్లో బాగానే జరిగింది. చివరి షెడ్యూల్ వచ్చేసరికి కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. నా పాత్ర షూటింగ్ ఫినిష్ అయ్యి తొమ్మిది నెలలు కావొస్తుంది. ఇప్పటివరకు నా పారితోషకం పూర్తిగా ఇవ్వలేదు. అంతేకాదు.. నా పాత్రకి డబ్బింగ్ కూడా వేరే వ్యక్తితో చెప్పించారు. ఆ విషయం నాకు ట్రైలర్ చూసినప్పుడే తెలిసింది. అప్పుడు నేను చాలా బాధపడ్డాను.
ఇలా నాకు చెప్పకుండా చేయడమనేది.. నాతో చేసుకున్న అగ్రిమెంట్ ని ఉల్లంఘించడమే అవుతుంది అంటూ మార్క్ డెవిల్ మేకర్స్ పై ఫైర్ అవుతూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారగా.. మార్క్ ట్వీట్ కి రిప్లై ఇస్తూ డెవిల్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.. మీకు ఇవాల్సిన డబ్బు ఎప్పుడో ఇచ్చేశాం, మీ మేనేజర్ మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. మమల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. మీకు ఇవ్వకుండా తానే డబ్బు తీసుకున్నాడు. ఇక డబ్బింగ్ విషయానికి వస్తే మీకేమో తెలుగు రాదు, అగ్రిమెంట్ లో డబ్బింగ్ విషయాలు ఉండవు. ఇక డబ్బింగ్ విషయమైనా ఏదైనా నిర్మాత ఇష్టం.
మీరు మమల్ని మా నిర్మాణ సంస్థని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. నీ మీద నాకు గౌరవం ఉంది. అది నీక్కూడా తెలుసు, నీ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తుంటాను అంటూ డెవిల్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఇచ్చిన రిప్లై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.