నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఏపీ ప్రజల్లో తన మార్క్ చూపిస్తూ 2024 ఎన్నికల కోసం ప్రిపేర్ అవుతున్నాడు. లోకేష్ వెంట టీడీపీ కార్యకర్తలు, చాలామంది ప్రజలు కూడా కాలు కదుపుతున్నారు. అయితే వైసీపీ నేతలు కొంతమంది లోకేష్ పాదయాత్రలో జనాలు లేరు అంటూ ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. కానీ లోకేష్ కి ఏపీ ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పడుతున్నారు. మధ్యలో చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు లోకేష్ రెండు నెలలు యువగళం పాదయత్రకి బ్రేకిచ్చి రీసెంట్ గానే మళ్ళీ మొదలు పెట్టారు.
అయితే ఈసారి లోకేష్ యువగళం పాదయాత్ర వేరే లెవల్ అన్నట్టుగా సాగుతుంది. కారణం టీడీపీతో పొత్తు ప్రకటించిన తర్వాత జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా లోకేష్ పాదయాత్రలో భాగమయ్యారు. లోకేష్ వెనుకగా టీడీపీ జెండాలు, జనసేన జెండాలతో కార్యకర్తలు కదం తొక్కుతున్నారు. మరి ఇప్పటివరకు టీడీపీ కార్యకర్తలే లోకేష్ పాదయాత్రలో కనిపించారు. ఇకపై జనసైనికులు లోకేష్ పాదయాత్రలో కనిపించడంతో అంతా కోలాహలంగా మారిపోయింది.