డిసెంబర్ 8 న మంచి అంచనాలు నడుమ థియేటర్స్ లో విడుదలైన నితిన్ ఎక్సట్రార్డినరీ మ్యాన్ మూవీ ప్రేక్షకులని ఇంప్రెస్స్ చెయ్యలేకపోయింది. నితిన్-శ్రీలీల కలయికల బావున్నా కంటెంట్ లో బలం లేకపోవడంతో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తిరస్కరించారు. వక్కంతం వంశీ రైటర్ గా సక్సెస్ అయినా.. దర్శకుడిగా వరసగా ఫెయిల్ అవుతున్నారు. గతంలో అల్లు అర్జున్ తో నా పేరు సూర్య తో ప్లాప్ మూటగట్టుకున్న వక్కంతం వంశీ.. ఇప్పుడు నితిన్ ని కూడా రిస్క్ లో పెట్టేసారు.
వరస ప్లాప్ లతో కొట్టుమిట్టాడుతున్న నితిన్ కి ఎక్సట్రార్డినరీ మ్యాన్ కూడా హిట్ అందించలేకపోయింది. అయితే ఓ మాదిరి టాక్ వచ్చినా కూడా ఈచిత్రాన్ని ఓ నెల తర్వాతే ఓటిటిలో విడుదల చేసేవారు. కానీ ఇప్పుడు ఈ చిత్రం ప్లాప్ లిస్ట్ లోకి వెళ్లడంతో.. త్వరలోనే ఓటిటిలోకి వచ్చేస్తుంది అని వార్తలొస్తున్నాయి. ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ ఎక్సట్రార్డినరీ మ్యాన్ డిజిటల్ హక్కులని సొంతం చేసుకుంది.
అయితే ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ జనవరి మొదటి వారంలో స్ట్రీమింగ్ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే ఎక్సట్రార్డినరీ మూవీ విడుదలైన నెల లోపే ఓటిటిలోకి వచ్చేస్తుంది.