పర భాషలో సూపర్ హిట్ అయిన 12th ఫెయిల్ మూవీ ని తెలుగులో డబ్ చేసి పొలిమేర 2, కీడా కోలా మూవీస్ కి పోటీగా అక్టోబర్ 27 న విడుదల చేశారు. ఈ చిత్రానికి క్రిటిక్స్ నుంచి సూపర్ హిట్ రివ్యూ వచ్చాయి. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. కానీ ఈ చిత్రానికి అనుకున్నమేర కలెక్షన్స్ రాలేదు. కారణం ఈ చిత్రం ఎలాంటి హడావిడి లేకుండా థియేటర్స్ లోకి రావడం, అలాగే పొలిమేర, కీడా కోలా లాంటి సినిమాల ప్రమోషన్స్ ముందు వీక్ గా కనిపించడంతో 12th ఫెయిల్ థియేటర్స్ లో ఎపుడు విడుదలయ్యిందో ఎప్పుడు వెళ్లిపోయిందో తెలియదు.
అయితే ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటిటిలోకి వస్తుందా అని ఫ్యామిలీ ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. తాజాగా 12th ఫెయిల్ మూవీ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన హాట్ స్టార్ వేధికగా స్ట్రీమింగ్ కాబోతుంది. ఈనెల అంటే డిసెంబర్ 29వ తేదీ నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. మరి థియేటర్స్ లో మిస్ అయిన వారు ఇప్పుడు ఓటిటిలో చూసేందుకు సిద్దమైపొండి.