Advertisementt

BB: ఈ విన్నరేం వెలగబెడతాడో?

Sun 24th Dec 2023 07:40 PM
pallavi prashanth  BB: ఈ విన్నరేం వెలగబెడతాడో?
Bigg Boss Telugu 7 winner Pallavi Prashanth BB: ఈ విన్నరేం వెలగబెడతాడో?
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ తెలుగు సీజన్స్ నుండి విన్నర్స్ గా బయటికొచ్చిన ప్రతి ఒక్కరూ కెరీర్ లో తెగ బిజీ అయ్యిపోతామనుకుని కలలు కన్నారు. కానీ బిగ్ బాస్ నుంచి విన్నర్స్ గా కాలర్ ఎగరేస్తూ బయటికొచ్చిన వారెవరూ కెరీర్ లో బిజీ అయిన దాఖలాలు లేవు. బిగ్ బాస్ వాళ్ళ క్రేజు, డబ్బు సంపాదించుకోవచ్చు అనుకుంటే.. డబ్బు ఏమో కానీ.. కెరీర్ లో అవకాశాలు లేక సైలెంట్ గా ఉన్నారు. మొదటి సీజన్ లో విన్నర్ గా శివ బాలాజీ ఇంకేంటి హీరోగా సినిమాలు చేస్తాడనుకుంటే.. కంటికి కనిపించకుండా పోయాడు.

ఆ తర్వాత కౌశల్ ని విన్నర్ గా అభిమానులు ఎత్తేసారు. ఆయన కూడా హీరో అవుదామనుకున్నాడు కానీ.. ఇప్పటికి అతని నుంచి ఎలాంటి గుడ్ న్యూస్ లేదు. ఇక తదుపరి విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా గతంలో ఎలా ఉన్నాడో.. ఇప్పుడూ అలానే ఉన్నాడు. ఇక సీజన్ 4 విన్నర్ అభిజిత్.. అతనైతే మళ్ళీ మీడియాలో కనిపించలేదు. బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ వీజె సన్నీ ఏదో హడావిడి చేసి వరసగా సినిమాలు చేస్తున్నాడు కానీ.. అన్ని డిసాస్టర్ అవుతున్నాయి.

సీజన్ 6 విన్నర్ సింగర్ రేవంత్ కూడా ఏడాదైంది మీడియాకి కనబడి. మరి ఇప్పటివరకు వచ్చిన బిగ్ బాస్ విన్నర్స్ ఎవరూ కేరీర్లో వెలిగిపోవడం లేదు. ఇప్పుడు విన్నర్ గా అవతరించిన కామన్ మ్యాన్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఏం వెలగబెడతాడో చూద్దామంటున్నారు నెటిజెన్స్. బిగ్ బాస్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్ కి వీరాభిమానులు వచ్చేసారు. మరి విన్నర్ అయ్యాక పల్లవికి ఎవరైనా సినిమా అవకాశాలిచ్చి హీరోని చేస్తారేమో చూడాలి.

Bigg Boss Telugu 7 winner Pallavi Prashanth:

Bigg Boss Telugu 7 winner Pallavi Prashanth next plans?

Tags:   PALLAVI PRASHANTH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ