Advertisementt

అదేమిటి రవితేజ కాదా..?

Tue 26th Dec 2023 10:53 AM
thandel  అదేమిటి రవితేజ కాదా..?
Thandel shooting update అదేమిటి రవితేజ కాదా..?
Advertisement
Ads by CJ

ఈరోజు మంగళవారం నాగ చైతన్య-చందు మొండేటి కాంబో తండేల్ నుంచి బ్యాక్ లుక్ వదులుతూ ఇంట్రెస్టింగ్ షూటింగ్ అప్ డేట్ ఇచ్చారు. తండేల్ మూవీ కోసం నాగ చైతన్య ఫుల్ గా మేకోవర్ అయ్యాడు. కొన్నాళ్లుగా నాగ చైతన్య హెయిర్ స్టయిల్, గెడ్డం, అలాగే ఫిట్ గా కనిపిస్తున్నాడు. సాయి పల్లవి హీరోయిన్ గా నటించనున్న ఈ తండేల్ రీసెంట్ గానే పూజా కార్యక్రమాలతో రెగ్యులర్ షూట్ కి వెళ్ళింది. సముద్రపు జాలర్ల నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.

అయితే ఈరోజు ఇచ్చిన అప్ డేట్ తో వదిలిన లుక్ లో నాగ చైతన్య బ్యాక్ లుక్ చూసి అదేమిటి రవితేజలా కనిపించాడు అంటున్నారు. రవితేజ ఈగల్ మూవీలో కనిపించినట్టుగా ఉంది నాగ చైతన్య లుక్ అంటున్నారు. కొందరైతే అది చూడగానే ఏంటి ఇది రవితేజ కాదా అనే కామెంట్స్ చేస్తున్నారు. నాగ చైతన్య వేసుకున్న కాస్ట్యూమ్, పోశ్చర్, హెయిర్ స్టయిల్, చేతికి నల్లతాడు, సైడ్ లుక్ అన్ని రవితేజ స్టైల్ లో ఉన్నాయంటున్నారు.

మొత్తానికి సాలిడ్ మేకోవర్ తో సాధారణ ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేసిన చైతూ అక్కినేని అభిమానులనైతే సంతోషంలో ముంచెత్తాడు. ఇక డెప్త్ ఉన్న సబ్జెక్ట్ తో - భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న తండేల్ నుంచి వరుసగా  అదిరిపోయే అప్ డేట్స్ రాబోతున్నాయంటూ మేకర్స్ ప్రకటించారు. 

Thandel shooting update:

Thandel begins an adrenaline pumping schedule in middle of the oceans

Tags:   THANDEL
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ