ఒకసారి జబర్దస్త్ స్టేజ్ పై నిలబడి యాంకర్ కమ్ బిగ్ బాస్ ఫేమ్ శివ ఏదో కాంట్రవర్సీ చేద్దామనుకుని అనసూయని పిచ్చి ప్రశ్నలు వెయ్యగా.. అనసూయకి కోపమొచ్చి జబర్దస్త్ స్టేజ్ పై నుంచి విసురుగా వెళ్లిపోగా.. యాంకర్ శివ, హైపర్ ఆది మళ్ళీ అనసూయని బ్రతిమాలి తీసుకువచ్చినట్టుగా అప్పట్లో జబర్దస్త్ ప్రోమో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. యూట్యూబ్ ఛానల్స్ లో ఇంటర్వ్యూ చేసే శివ ఏదో కాంట్రావర్సీ ప్రశ్నలతో హైలెట్ అవుదామనుకుని చూస్తుంటాడు.
అయితే తాజాగా ఢీ లో సీజన్ 16 లో సెలెబ్రిటీ డాన్స్ షో లో భాగంగా ఈ బుధవారం ఎపిసోడ్ ప్రోమో విడుదల చేసారు. ఢీ షో లోకి వచ్చిన కొంతమంది సెలబ్రిటీస్ ని వారి ఫ్రెండ్స్ వాళ్ళు సెలెబ్రిటీస్ నే. సపోర్ట్ చేయడానికి మెంటర్స్ గా వస్తున్నారు. అందులో భాగంగా యాంకర్ శివ ఢీ డాన్స్ షోలో కనిపించాడు. రాగానే జెడ్జ్ శేఖర్ మాస్టర్ మీకో ప్రశ్న అంటూ.. మీకు ఓ హీరోయిన్ కి ఎఫ్ఫైర్ ఉంది అంట బయట మాట్లాడుకుంటున్నారు అనగానే శేఖర్ మాస్టర్ కి కోపమొచ్చింది.
మాకు ఫ్యామిలీ ఉంది మేము ఎంత ఎఫెక్ట్ అవుతామో తెలుసా.. అసలు ఇలాంటి అతన్ని ఎవరు తీసుకొచ్చారు.. నేను షో నుంచి వెళ్ళిపోతాను అంటూ శేఖర్ మాస్టర్ లేచి వెళ్లిపోగా.. అక్కడే ఉన్న ఆది, మరో జెడ్జ్ ప్రణీత సుభాష్ లు షాకైపోయారు. మరి ఇది ఆ షో కి హైప్ చెయ్యడానికి చేసారా.. లేదంటే మారేదన్నానా అనేది మాత్రం ఈ బుధవారం ఢీ ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తేనే తెలుస్తుంది.