రేపు శుక్రవారం విడుదల కాబోయే డెవిల్ విషయంలో చాలా కాంట్రవర్సీ నడించింది. ముఖ్యంగా దర్శకుడు నవీన్ మేడారం కి నిర్మాత అభిషేక్ నామా కి మధ్యన ఈగో క్లాషెస్ రావడంతో సినిమా విడుదల కూడా ఆలస్యమైంది. అసలు దర్శకుడిగా నవీన్ మేడారం ని తప్పించేసి అదే ప్లేస్ లో అభిషేక్ నామ తన పేరు వేసుకోవడంపై చాలా రకాల వార్తలో సోషల్ మీడియాలో కనిపించాయి. అయితే డెవిల్ విడుదలకు ముందు నవీన్ మేడారం ఏమైనా చిక్కులు సృష్టిస్తాడు అనుకుని అభిషేక్ నామా కాస్త కంగారు పడ్డాడు.
కానీ నవీన్ మేడారం హుందాగా నిన్న డెవిల్ పై ఓ లేఖని వదిలాడు. కొంతమంది ఈగో క్లాష్ వలన తనకు ఈ ప్రాజెక్ట్ నుంచి బయటికి వచ్చాను, షూటింగ్ మొత్తం పూర్తయ్యాకే బయటికి వచ్చాను, 105 రోజుల పాటు ఈ సినిమాను వివిధ లొకేషన్లలో చిత్రీకరించానని, డెవిల్ కి తానే దర్శకుడిని అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. నవీన్ మేడారం పోస్ట్ తర్వాత అందరూ అభిషేక్ నామా రిప్లై కోసం వెయిట్ చేసారు. మరి అభిషేక్ నామా కూడా ఈ విషయమై కాస్త ఘాటుగానే స్పందించాడు.
అసలు డెవిల్ సినిమాకు సంబంధించి బేసిక్ స్టోరీ లైన్ తనదేనని చెప్పిన అభిషేక్ నామ.. ఆ లైన్ ఆధారంగా శ్రీకాంత్ విస్సా స్క్రిప్టు రెడీ చేశాడని.. శ్రీకాంత్ నరేషన్ విన్నాకే కళ్యాణ్ రామ్ మాతో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. కథ, హీరో దొరికాక.. మా బ్యానర్లో బాబు బాగా బిజీ సినిమా చేసిన నవీన్ మేడారంను దర్శకుడిగా ఎంచుకున్నామని చెప్పాడు. డెవిల్ రెగ్యులర్ షూట్ మొదలయ్యాక రెండో రోజుకే నవీన్ ఇంత పెద్ద ప్రాజెక్టును హ్యాండిల్ చేయలేడని అర్థమైందని.. ఆ తర్వాత తనే డైరెక్షన్ చెయ్యడానికి రెడీ అయ్యానని చెప్పాడు.
టెక్నీషియన్ల సహకారంతో డెవిల్ ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ పూర్తి చేశానని.. అయితే నవీన్ సినిమా సరిగా తీయట్లేదు చెప్పినా కూడా వినకుండా.. కొంతకాలం డెవిల్ సెట్స్ కి వస్తూ టీమ్ తో కంటిన్యూ అయ్యాడని.. కానీ సినిమా మొత్తం డైరెక్షన్ చేసింది తనేనని.. అందుకే దర్శకుడిగా క్రెడిట్ తీసుకున్నానని, అందులో ఎలాంటి తప్పు లేదు అన్నట్టుగా అభిషేక్ నామా చెప్పుకొచ్చాడు.