గుంటూరు కారం నుంచి వచ్చిన రెండు సాంగ్స్ అభిమానులని బాగా నిరాశపరిచాయి. శ్రీలీల లాంటి మంచి డాన్సర్ ని పెట్టుకుని ఇలాంటి చెత్తపాటలు ఇస్తున్నారని థమన్ ని త్రివిక్రమ్ ని తిట్టుకోని రోజు లేదు. ఆఖరికి లిరిక్స్ విషయంలోనూ మహేష్ బాబు ఫ్యాన్స్ శాటిస్ఫై అవ్వలేకపోయారు. దానితో రామజోగయ్య శాస్త్రిని సోషల్ మీడియాలో ట్రోల్ చేసారు. మరోపక్క ఈ విషయంలో మహేష్ బాబు కూడా థమన్, త్రివిక్రమ్ పై సీరియస్ అయ్యాడనే న్యూస్ నడిచింది. అదలాఉంటే.. గుంటూరు కారం పై గత వారం రోజులుగా పోస్టర్స్ మీద పోస్టర్స్ వదులుతూ అంచనాలను రెట్టింపు చేస్తున్నారు నిర్మాత నాగవంశీ.
అందులో భాగమే గుంటూరు కారం నుంచి మూడో పాట విడుదల అంటూ ఇచ్చిన పోస్టర్ దుమ్మురేపింది. మహేష్ మాసివ్ డాన్స్ లుక్ కి శ్రీలీల అదిరిపోయే మాస్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు గుంటూరు కారం మూడో సింగిల్ ప్రోమో వదిలారు. కుర్చీ మడతపెట్టి అంటూ మహేష్ వేసిన స్టెప్స్ కి ఆయన అభిమానులకి పూనకలొచ్చేస్తున్నారు. సాధారణ ప్రేక్షకులు కూడా మహేష్ స్టెప్స్ చూసి వావ్ అంటున్నారు. ఇక శ్రీలీల అయితే తనకి కొట్టిన పిండి లాంటి డాన్స్ స్టెప్స్ లో రచ్చ చేసింది.
మహేష్ బాబు-శ్రీలీల పెయిర్ కుర్చీ మడతపెట్టి సాంగ్ లో దుమ్మురేపారనడంలో సందేహం లేదు.. మరి నేడు ప్రోమోనే ఇంతలా ఊపేస్తే.. ఇక ఫుల్ సాంగ్ వస్తే.. మహేష్ ఫ్యాన్స్ ఇంకెంత రచ్చ చేస్తారో.!