Advertisementt

సంక్రాంతి బరి నుంచి రవితేజ ఈగల్ అవుట్

Thu 04th Jan 2024 09:16 PM
ravi teja,eagle  సంక్రాంతి బరి నుంచి రవితేజ ఈగల్ అవుట్
Ravi Teja Eagle Out of Sankranti race సంక్రాంతి బరి నుంచి రవితేజ ఈగల్ అవుట్
Advertisement
Ads by CJ

గత రెండు రోజులుగా రవితేజ ఈగల్ సంక్రాంతి బరి నుంచి తప్పుకోబోతుంది అనే రూమర్స్ కి ఈరోజు ఓ క్లారిటీ వచ్చేసింది. నిర్మాతల మండలిలో సమావేశమైన గిల్ట్ మీటింగ్ లో ఈగల్ ని పోస్ట్ పోన్ చేసుకునేందుకు ఈగల్ నిర్మాతలు ఒప్పుకోవడంతో సమస్య పరిష్కారమైనట్టుగా దిల్ రాజు ప్రకటించారు. ఈ సంక్రాంతికి గుంటూరు కారం, హనుమాన్, ఈగల్, సైంధవ్‌, నా సామిరంగా మూవీస్ విడుదలవుతుండగా.. కొన్ని సినిమాలకి థియేటర్స్ సమస్య రావడంతో అందరూ కలిసి కూర్చుని మట్లాడుకుని ఈగల్ కి సోలో రిలీజ్ ఇచ్చేలా ఒప్పందం చేసుకోవడంతో ఈగల్ నిర్మాతలు వెనక్కి తగ్గేందుకు ఒప్పుకున్నారు.

గిల్డ్ సమావేశంలో..

నిర్మాత దిల్ రాజు కామెంట్స్

సోషల్ మీడియా లో వస్తున్న ఆర్టికల్స్ ఇండస్ట్రీ కి చెడ్డ పేరు వస్తుంది

నిజాలు తెలుసుకొని రాయండి అని నా మనవి..

సంక్రాంతి కి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన నిర్మాతలతో మీటింగ్ పెట్టాము

ఒక సినిమా వెనక్కి తగ్గితే ఏదో జరిగినట్టు కాదు ..

పోయిన సారి మూడు సినిమాలకే రచ్చరచ్చ చేసారు

ఇప్పుడు 5 సినిమాలు పోటీలో ఉన్నాయి

మేము అందరం కూర్చొని నిర్ణయం తీసుకున్నాము

రవితేజ గారికి పీపుల్స్ మీడియా వారికి మా కృతజ్ఞతలు

ఇదొక మంచి పరిణామం

దామోదర ప్రసాద్. కామెంట్స్

సంక్రాంతి కి రిలీజ్ కు నెంబర్ ఆఫ్ మూవీస్ వస్తున్నాయి

15రోజుల క్రితం నిర్మాతల తో మీటింగ్ పెట్టి గ్రౌండ్ రియాలిటీ చెప్పాం..

నిర్మాతలు కోపరేట్ చేస్తున్నారు

రవితేజ ఈగల్ సినిమా నిర్మాతలకు థాంక్స్..

Ravi Teja Eagle Out of Sankranti race:

Ravi Teja Eagle postponed- out of Sankranti race

Tags:   RAVI TEJA, EAGLE
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ