ఏపీలో ఎన్నిలకలకు సమయం పెద్దగా లేదు. ఈ క్రమంలోనే వైసీపీ అయితే వడివడిగా అడుగులు వేస్తోంది. ‘వై నాట్ 175’ లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతోంది. చాలా మంది సిట్టింగ్‌లను ఈసారి పక్కనపడేస్తోంది. కొందరికి స్థాన చలనం కల్పిస్తోంది. ఇప్పటికే సిట్టింగ్‌లను మారుస్తూ రెండు లిస్ట్‌లను వైసీపీ అధినేత విడుదల చేశారు. తాజా లిస్ట్‌లో మంత్రులను సైతం తొలగించారు. వారిలో మంత్రి అమర్నాథ్ ఒకరు. స్థాన చలనమా? అంటే అదీ కాదు. అనకాపల్లి నియోజకవర్గం బాధ్యతల నుంచి పూర్తిగా తప్పించేశారు. ఆ బాధ్యతలను కురసాల భరత్‌కు అప్పగించారు. నిజానికి అమర్నాథ్‌కు ఇది ఊహించని షాకే.
కామెడీ పీస్ అయిపోయారు..
నిజానికి గుడివాడ అమర్నాథ్‌కు మంచి అవకాశం దొరికింది. ఐటీ మంత్రిగా అద్భుతమైన ఛాన్స్. కానీ వినియోగించుకోవడంలో విఫలం అయ్యారు. ఐటీ శాఖను వదిలి కోడిగుడ్డు కథలు వినిపించారు. అయితే కోడిగుడ్డు ఇంత పని చేస్తుందని గుడివాడ అమర్నాథ్ ఊహించి ఉండరు. ఎంఓయూలంటే కారప్పొడులు, మసాలాల గురించి అసెంబ్లీలో చెప్పారు. ఆయన మీడియా ముందు పెదవి విప్పిన ప్రతిసారీ సోషల్ మీడియాలో ప్రతి సారీ వైరల్ అవుతూనే ఉన్నారు. మొత్తానికి వైసీపీలో ఆయనొక కామెడీ పీస్ అయిపోయారు. పోనీ నియోజకవర్గంలో ఏమైనా మంచి పేరు ఉందా? అదీ లేదు. తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది.
సీనియర్స్ ఊరుకోరు..!
మొత్తానికి గుడివాడ అమర్నాథ్‌కి టికెట్ ఇచ్చినా గెలిచేంత సీన్ లేదని గ్రహించిన వైసీపీ అధినేత చివరకు ఆయన స్థానంలో మరొకరిని నియమించారు. వేరొక చోట అవకాశం ఇస్తారో కూడా లేదో కూడా తెలియదు. పోనీ చోడవరం, ఎలమంచలి నుంచి ట్రై చేద్దామా? అంటే అక్కడ ఇద్దరు సీనియర్లు కరణం ధర్మశ్రీ, కన్నబాబులు ఊరుకోరు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అమర్నాథ్ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. మొత్తానికి అమర్నాథ్ అయితే దిక్కుతచని స్థితిలో ఉండిపోయారు. మరి అధిష్టానం కలుగజేసుకుని ఆయనను ఏమైనా బుజ్జగిస్తుందో లేదంటే ఆయన వల్ల ఉపయోగమేమీ లేదని వదిలేస్తుందో చూడాలి.