Advertisementt

తండేల్ థండర్: నాగ చైతన్య ఇచ్చిపడేసాడు

Sat 06th Jan 2024 12:49 PM
thandel  తండేల్ థండర్: నాగ చైతన్య ఇచ్చిపడేసాడు
Essence of Thandel out now తండేల్ థండర్: నాగ చైతన్య ఇచ్చిపడేసాడు
Advertisement
Ads by CJ

కార్తికేయ 2 ప్యాన్ ఇండియా హిట్ తర్వాత చందు మొండేటి హీరో నాగ చైతన్యతో కలిసి మొదలు పెట్టిన తండేల్ మూవీ షూటింగ్ మొదలైన చాలా కొద్దిరాజులకే తండేల్ థండర్ అంటూ గ్లిమ్ప్స్ వదిలి అందరిని ముఖ్యంగా అక్కినేని ఫాన్స్ ని సర్ ప్రైజ్ చేసారు. తండేల్ ప్రీ ప్రొడక్షన్ నుంచే అంచనాలను రేపుతున్న దర్శకుడు నాగ చైతన్య మేకోవర్ తో మరింత హైప్ క్రియేట్ చేసారు. ఈ గ్లిమ్ప్స్ తోనే అసలు తండేల్ కథా నేపథ్యం ఏమిటో ఆల్మోస్ట్ రివీల్ చేసేసారు.

నాగ చైతన్య జాలరిగా నడి సముద్రపు నావపై సూపర్బ్ మేకోవర్ తో కనిపించగా.. సాయి పల్లవి చాలా క్యూట్ గా ఆహ్లాదంగా కనిపించింది. శ్రీకాకుళం యాసలో చైతు చెప్పిన ప్రతి డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. గుర్తెట్టుకో.. ఈపాలి యాట గురి తప్పేదే లెస్.. ఇక రాజులమ్మ జాతరే అనే డైలాగ్, అలాగే  జైలులో ఖైదు చేసినప్పుడు జైలర్ వచ్చి ఏంట్రా దేశభక్తా.. అది కూడా మీ దేశానికే అనగా.. మా నుండి ఊడిపోయిన ఓ ముక్క, మీకే అంతుంటే.. ఆ ముక్కని ముష్టెసిన మాకెంతుండాలి అంటూ పాకిస్తాన్ పై చెప్పిన చైతు డైలాగ్ గూస్ బంప్స్ తెప్పించేసింది. ఇక సముద్రపు సన్నివేశాలు, ఇటు పాకిస్తాన్ జైలు విజువల్స్ అన్ని అద్భుతంగా సెట్ అయ్యాయి. తండేల్ పై ఈ థండర్ గ్లిమ్ప్స్ అంచనాలు మరింతగా పెంచేసాయి.

దేవిశ్రీ ఇచ్చిన నేపధ్య సంగీతం అదిరింది, చివరిగా సాయి పల్లవి ఇంట్రడక్షన్ ఈ గ్లిమ్ప్స్ కే హైలెట్ అనేలా ఉంది. బన్నీ వాస్ నిర్మాతగా గీత ఆర్ట్స్ బ్యానర్ లో చందు మొండేటి దర్శకత్వంలో రాబోతున్న తండేల్ థండర్ కి అక్కినేని అభిమానులే కాదు మూవీ లవర్స్ బాగా ఇంప్రెస్స్ అవుతున్నారు.

Essence of Thandel out now:

Thandel glimpse out now

Tags:   THANDEL
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ