కొద్దిరోజులుగా వైస్సార్సీపీ కి గడ్డురోజులు నడుస్తున్నాయి. జిల్లాల వారీగా ఇన్ ఛార్జుల మార్పుతో వైస్సార్సీపీ నేతలు ఒక్కొక్కరిగా రాజీనామాలు చేస్తూ పక్క పార్టీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే చాలామంది మంత్రులు, ఎమ్యెల్యేలు, ఎమ్యెల్సీ రాజీనామా వరకు వెళుతూ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. సరే వాళ్ళేప్పటినుంచో పార్టీలో ఉన్నారు, ఇప్పుడు సముచిత స్థానం కోసం పంతానికి వెళుతున్నారు. కానీ అసలు వైసీపీ లో చెరీ చేరగానే వైసీపీ కి గుడ్ బై చెప్పడం చూస్తే మూణ్ణాళ్ళ ముచ్చట అనిపించకమానదు.
అది క్రికెటర్ అంబటి రాయుడు వైస్సార్సీపీ లో చేరి జగన్ చేత కండువా కప్పించుకున్న వారానికే జగన్ కి షాకిస్తూ వైసీపీ కి రాజీనామా చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. అసలు ఏం జరిగిందో ఏమిటో.. వైసీపీ కి వీర విధేయుడిగా కనిపించిన అంబటి ఇలా ఉన్నట్టుండి వైసీపీ వీడుతున్నట్లు చేసిన ట్వీట్ సంచలనం రేపుతోంది. అంతేకాకుండా తాను కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పడం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. అసలు రాజకీయాల్లోకి వచ్చి వారమే గడిచింది, ఇంతలోనే రాజకీయాలకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడమేమిటో అంటూ కామెడీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.
అయితే వైసీపీ అధిష్టానం ఒంటెత్తు పోకడలు, ఏకపక్ష ధోరణి నచ్చకపోవడంతోనే అంబటి రాయుడు ఇలా సడన్ ట్విస్ట్ ఇస్తూ జగన్ కి బై బై చెప్పేసాడని అంటుంటే.. గతంలో క్రికెట్ లోను ప్రపంచ కప్ సందర్భంగా తనను ఎంపిక చేయకపోవడంతో రాయుడు అప్పుడు కూడా అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెబుతూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా అదే మాదిరి తన మాట చెల్లుబాటు కాలేదనే ఆత్మాభిమానంతో, ఆత్మగౌరవంతో వైసీపీకి కూడా అంబటి రాయుడు గుడ్ బై చెప్పాడని సోషల్ మీడియాలో టాక్ వస్తోంది. మరి ఇది ఒకరకంగా జగన్ కి పెద్ద షాక్ అని చెప్పాలి.