Advertisementt

రెండో పెళ్ళికి సిద్దమయ్యారా?

Mon 08th Jan 2024 03:29 PM
aditi rao hydari,siddharth  రెండో పెళ్ళికి సిద్దమయ్యారా?
Siddharth and Aditi Rao Hydari love story రెండో పెళ్ళికి సిద్దమయ్యారా?
Advertisement
Ads by CJ

నటుడు సిద్దార్థ్, అదితి రావు లు రెండో పెళ్ళికి సిద్దమయ్యారా.. ఇప్పుడిదే హాట్ టాపిక్. బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు మీడియాలో కదలాడుతున్న ప్రశ్న.  కోలీవుడ్ హీరో అయినా తెలుగు ప్రేక్షకులకి అత్యంత ఇష్టమైన హీరోగా మారిన సిద్దార్థ్ కి ఆల్రెడీ పెళ్లయ్యింది. మధ్యలో లవ్ బ్రేకప్స్ కూడా అయ్యాయి. అలాగే హిందీ హీరోయిన్ అదితి రావు కి కూడా పెళ్ళై భర్తతో విడాకులు తీసుకుంది. మహాసముద్రం సినిమా సమయంలో సిద్దార్థ్-అదితిలు ప్రేమలో పడ్డారు. కొన్నాళ్ళు ప్రేమని గుట్టుగా దాచిన ఈ జంట ఇప్పుడు అందరికి తెలిసే తిరుగుతున్నారు.

న్యూ ఇయర్ వేడుకలు కోసం లండన్ వెళ్లి అక్కడే న్యూ ఇయర్ కి స్వాగతం పలికిన ఈ జంట వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఎయిర్ పోర్ట్ లో కలిసే కనిపించారు. దానితో బాలీవుడ్ మీడియా అదితి-సిద్దు ఇద్దరూ పెళ్లికి రెడీ అయ్యారు అంటూ కథనాలు ప్రసారంలోకి తెచ్చింది. ఇక సోషల్ మీడియాలోనూ వీరిరువురు అతి త్వరలోనే ఓ ఇంటి వారు కాబోతున్నారనే న్యూస్ బాగా హైలెట్ అవుతుంది. మరి ప్రేమ, పెళ్లి అంటే కస్సుమని లేచే సిద్దు, అదితి లు ఈ విషయంపై ఎలా స్పందిస్తారో చూడాలి.

Siddharth and Aditi Rao Hydari love story:

Wedding bells for Aditi Rao Hydari and Siddharth

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ