ఈ శుక్రవారమే సంక్రాంతి పండగ స్పెషల్ గా జనవరి 12 న విడుదల కాబోతున్న గుంటూరు కారం పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ప్రస్తుతం మహేష్ మరియు హీరోయిన్స్ శ్రీలీల, మీనాక్షి చౌదరి, త్రివిక్రమ్, థమన్ వీరంతా స్పెషల్ ఫ్లైట్ లో గుంటూరుకి బయలుదేరారు. గన్నవరం విమానాశ్రయంలో దిగి రోడ్డుమార్గాన గుంటూరు కారం ఈవెంట్ జరిగే ప్రదేశానికి చేరుకున్నారు. అయితే శుక్రవారం విడుదల కాబోతున్న గుంటూరు కారం ఘాటు మరింతగా పెంచేసింది తెలంగాణ ప్రభుత్వం.
గుంటూరు కారం సినిమా టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి
సింగిల్ స్క్రీన్లలో రూ.65, మల్టీఫ్లెక్స్ థియేటర్లలో రూ.100 పెంపునకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం
గుంటూరు కారం బెన్ ఫిట్ షోలకు అనుమతి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం
ఈ నెల 12న అర్థరాత్రి 1 గంట బెన్ ఫిట్ షోకు రాష్ట్రంలో 23 చోట్ల ప్రదర్శనలకు అనుమతి
గుంటూరు కారం ఆరో షో ప్రదర్శనకు అనుమతి
ఈ నెల 12 నుంచి 18 వరకు ఉదయం 4 గంటల షోకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.