Advertisementt

కళ్యాణ్ రామ్ కి అంత తొందరెందుకు

Sun 14th Jan 2024 11:31 AM
devil  కళ్యాణ్ రామ్ కి అంత తొందరెందుకు
Devil locks its OTT release date కళ్యాణ్ రామ్ కి అంత తొందరెందుకు
Advertisement
Ads by CJ

కళ్యాణ్ రామ్ తొందర పడ్డాడా.. అంటే నిజమే అనిపిస్తుంది. కారణం కళ్యాణ్ రామ్ లేటెస్ట్ చిత్రం డెవిల్ ని తొందరపడి రెండు వారాలు తిరక్కుండానే ఓటిటిలో రిలీజ్ చేసేస్తున్నాడు. అభిషేక్ నామా దర్శకత్వంలో కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన డెవిల్ డిసెంబర్ 29 న 2023 ఇయర్ ఎండ్ కి థియేటర్స్ లో విడుదలైంది. ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ రాగా.. కళ్యాణ్ రామ్ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో డెవిల్ సీక్వెల్ అంటే పార్ట్ 2 ని కూడా అనౌన్స్ చేసారు. ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా సెకండ్ కాస్త దేశభక్తి ఎక్కువైనట్టుగా ఉన్న డెవిల్ మూవీని ప్రేక్షకులు బాగానే ఆదరించారు.

థియేటర్స్ లో హిట్ అయినా, ప్లాప్ అయినా థియేటర్స్ లో విడుదలైన నాలుగు వారాలకే ఓటిటిలోకి వస్తున్న ఈ రోజుల్లో డెవిల్ మాత్రం జస్ట్ రెండు వారాలు తిరిగేసరికి ఓటిటిలో స్ట్రీమింగ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసారు. కళ్యాణ్ రామ్ డెవిల్ ఓటిటి హక్కులని ఫ్యాన్సీ రేటుకి చేజిక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ వారు జనవరి 14 సంక్రాంతి స్పెషల్ గా రేపు సోమవారం నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇది చూసిన నెటిజెన్స్ కళ్యాణ్ రామ్ ఎందుకంత తొందర అంటూ కామెంట్ చేస్తున్నారు.

Devil locks its OTT release date:

Nandamuri Kalyan Ram Devil locks its OTT release date

Tags:   DEVIL
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ