Advertisementt

పవన్ కళ్యాణ్ ను కలిసిన YS షర్మిల

Wed 17th Jan 2024 09:30 PM
ys sharmila  పవన్ కళ్యాణ్ ను కలిసిన YS షర్మిల
YS Sharmila Invitation To Pawan Kalyan పవన్ కళ్యాణ్ ను కలిసిన YS షర్మిల
Advertisement
Ads by CJ

ఏపీ కాంగ్రెస్ లో చక్రం తిప్పబోతున్న YS షర్మిల ప్రస్తుతం రాజకీయప్రముఖులని కలిసే హడావిడిలో ఉన్నారు. కారణం షర్మిల కొడుకు రాజారెడ్డి అట్లూరి ప్రియను పెళ్లాడనున్న సంగతి తెలిసిందే. వీరి నిశ్చితార్థం జనవరి 18న జరగనుండగా, ఫిబ్రవరి 17న పెళ్లి జరగనుంది. ఈ నేపథ్యంలో, షర్మిల ప్రముఖులను కలుస్తూ, కుమారుడి శుభలేఖ అందించి, నిశ్చితార్థంతో పాటు పెళ్లికి కూడా రావాలని ఆహ్వానిస్తున్నారు. రీసెంట్ గా అన్న జగన్ మోహన్ రెడ్డికి కొడుకు పెళ్లి పత్రిక ఇచ్చి వచ్చిన షర్మిల ఆ తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఇలా ప్రముఖుల నివాసాలకు వెళ్లి పెళ్లి పత్రికలు అందజేశారు.  

వైఎస్ షర్మిల ఈరోజు బుధవారం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను కలిశారు. హైదరాబాదులో పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లిన షర్మిల తన కుమారుడి పెళ్లి కార్డు అందించారు. రాజారెడ్డి-అట్లూరి ప్రియ నిశ్చితార్థం కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు హైదరాబాదులోని గోల్కొండ రిసార్ట్స్ వేదికగా నిలుస్తోంది. ఈ కార్యక్రమానికి షర్మిల సోదరుడు ఏపీ సీఎం జగన్ కూడా హాజరవుతున్నట్టు తెలుస్తోంది. 

YS Sharmila Invitation To Pawan Kalyan:

YS Sharmila Meets Pawan Kalyan

Tags:   YS SHARMILA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ