Advertisementt

జగన్‌కు బద్దశత్రువులుగా చెల్లెళ్లు!

Thu 18th Jan 2024 08:10 PM
ys jagan sisters  జగన్‌కు బద్దశత్రువులుగా చెల్లెళ్లు!
Sisters Turns Enemies to YS Jagan జగన్‌కు బద్దశత్రువులుగా చెల్లెళ్లు!
Advertisement
Ads by CJ

ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌కు దెబ్బల మీద దెబ్బ తగులుతున్నాయి. ఇప్పటికే పార్టీలోని చాలా మంది నేతలు పక్కదారి పడుతుంటే ఆయన చెల్లెళ్లు సైతం ఆయనకు ఇబ్బందికరంగా మారారు. ఒకప్పుడు వారిని వినియోగించుకుని జగన్ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు అదే చెల్లెళ్లు ఆయనకు దెబ్బేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే జగన్ సొంత చెల్లి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో చెల్లెలు అంటే బాబాయి వైఎస్ వివేకా కూతురు సునీతా రెడ్డి పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు టాక్ నడుస్తోంది. షర్మిల కాంగ్రెస్‌లో చేరాలనుకోవడం సంచలనం రేపుతోంది.

జగన్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌లోకి..

గత ఎన్నికల సమయంలో వైఎస్ వివేకా హత్య జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో సునీతారెడ్డిని జగన్ తనకు అనుకూలంగా మార్చుకుని వివేకా హత్య విషయమై మీడియా ఎదుట ఆమెతో మాట్లాడించి లబ్ది పొందారు. ఇక ఇప్పుడు పరిస్థితులు మారాయి. అసలు ఈ కేసులో దోషులెవరన్నది ఒక క్లారిటీ వచ్చింది. నిజం తెలుసుకున్న సునీత సుప్రీంకోర్టు మెట్లెక్కారు. అప్పటి నుంచి జగన్‌కు సునీతా రెడ్డి శత్రువైపోయారు. దీంతో ఆమెను సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే తాజాగా ఆమె జగన్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇప్పటికే జగన్ సొంత చెల్లెలు షర్మిల ఏపీ పీసీసీ పగ్గాలు చేపట్టారు. ఈ క్రమంలోనే సునీత కూడా అదే పార్టీలో చేరాలనుకోవడం చర్చనీయాంశంగా మారింది.  

సునీతపై పెద్ద ఎత్తున ట్రోల్స్..

తన తండ్రి వైఎస్ వివేకా హత్య కేసులో సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పోరాడుతున్నారు. ఈ హత్య విషయంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి చేయించారనేది ఆమె వాదన. పైగా ఈ హత్య విషయం జగన్, ఆయన సతీమణి భారతికి ముందే తెలుసని ఆమె చెబుతున్నారు. ఈ క్రమంలోనే సునీతపై పేటిఎం బ్యాచ్ పెద్ద ఎత్తున దారుణమైన ప్రచారం మొదలు పెట్టింది. టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పినందువల్లే సునీత ఇలా చేస్తున్నారంటూ ప్రచారం చేస్తోంది. ఆమెపై పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తోంది. ఈ క్రమంలోనే సునీత ఇక మీదట తన పోరాటాన్ని పొలిటికల్‌గానే తేల్చుకోవాలని డిసైడ్ అయినట్టున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే సునీత-షర్మిల మధ్య చర్చలు కూడా ముగిశాయి. సునీత కాంగ్రెస్‌లో చేరడం ఖాయంగానే కనిపిస్తోంది. మొత్తానికి జగన్‌కు టీడీపీ కంటే బద్దశత్రువులుగా చెల్లెళ్లు మారబోతున్నారన్నది కూడా ఖాయమే.

Sisters Turns Enemies to YS Jagan:

Sunitha Reddy Also to Join Congress Party

Tags:   YS JAGAN SISTERS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ