గురువారం నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. చంద్రబాబు నాయుడు, రామకృష్ణ, బాలకృష్ణ, కళ్యాణ్ రామ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ వంటి వారంతా ఎన్టీఆర్ ఘాట్‌ని సందర్శించి.. అంజలి ఘటించారు. అయితే ఇక్కడో వివాదం చెలరేగింది. నందమూరి బాలకృష్ణ అక్కడున్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తీసేయండి అంటూ చెబుతున్నట్లుగా ఓ వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీంతో అంతా.. ముఖ్యంగా తారక్ అభిమానులు బాలయ్యపై మండిపడుతూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే బాలయ్య ఈ ఫ్లెక్సీలు తీసేయమనడానికి అసలు కారణం వేరే ఉందని తెలుస్తోంది.
అదేంటంటే.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద గేట్‌కి అడ్డంగా పెట్టిన ఫ్లెక్సీలలో హరికృష్ణ, కళ్యాణ్ రామ్, తారక్ మాత్రమే ఉన్న ఫ్లైక్సీలను కావాలని వైసీపీకి చెందిన మురళి అనే అతను ఏర్పాటు చేశారు. ఇది కూడా ఇష్యూ కాదు. ఆ ఫ్లెక్సీలలో స్వాగతం, సుస్వాగతం అని రాసి ఉండటం చూసిన బాలయ్య సీరియస్ అయ్యారని టాక్ వినబడుతోంది. వర్ధంతికి స్వాగతం, సుస్వాగతం అని ఎవరూ మెన్షన్ చేయరు. నందమూరి అభిమానుల మధ్య చిచ్చు పెట్టడానికి వైసీపీకి చెందిన తారక్ ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబర్ మురళీ అనే అతను చేయించిన పనిగా దీనిని చెప్పుకుంటున్నారు.
అయితే గతంలోనూ ఇలాంటి స్వాగతం-సుస్వాగతం ఫ్లెక్సీలు ఉన్నాయి కదా.. అప్పుడెందుకు తీసేయలేదు అంటూ కొందరు ఫ్యాన్స్ ఇదే కార్యక్రమానికి సంబంధించిన పాత ఫ్లెక్సీలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, కామెంట్స్ చేస్తున్నారు. మరో విషయం ఏమిటంటే.. వర్ధంతికి నివాళులు అర్పించడానికి తారక్ వస్తే.. కావాలని కొందరు ఎన్టీఆర్ సీఎం, ఎన్టీఆర్ సీఎం అంటూ నినాదాలు చేయడం కూడా.. ఈ ఇష్యూకి కారణంగా తెలుస్తోంది. సందర్భం ఏమిటి? స్లోగన్స్ ఏమిటి? అనేలా తారక్ వచ్చిన సమయంలో అభిమానులు చేసిన నినాదాలు గురించి మాట్లాడుకోవడం విశేషం. అలాగే.. ఈ ఫ్లెక్సీ ఇష్యూపై వైసీపీ నాయకులు రియాక్ట్ అవడం చూస్తుంటే.. కావాలనే రెచ్చగొడుతున్నట్లుగా కూడా కనిపిస్తోందని.. ఈ ఇష్యూపై కొందరు కామెంట్స్ చేస్తున్నారు.