Advertisementt

రష్మిక డీప్‌ఫేక్‌.. నిందితుడు అరెస్ట్

Sun 21st Jan 2024 12:59 PM
rashmika deep fake  రష్మిక డీప్‌ఫేక్‌.. నిందితుడు అరెస్ట్
Rashmika Mandanna Deep Fake Creator Arrested రష్మిక డీప్‌ఫేక్‌.. నిందితుడు అరెస్ట్
Advertisement
Ads by CJ

నేషనల్ క్రష్ రష్మిక మందన్నాతో పాటు.. ఇతర హీరోయిన్ల డీప్‌ఫేక్‌ వీడియోలు ఈ మధ్య వైరల్ అయి.. సంచలనంగా మారాయి. ఈ విషయంలో రష్మికకు అన్ని ఇండస్ట్రీల నుండి సపోర్ట్ వచ్చింది. వేరే అమ్మాయి బాడీకి రష్మిక హెడ్ తగిలించి.. నానా హంగామా చేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. వెంటనే ఆ వీడియో క్రియేట్ చేసిన వారిని పట్టుకోవాలని ఆర్డర్స్ జారీ చేసింది. ఈ వీడియో వచ్చిన ఇన్నాళ్లకు ఈ కేసులో కీలక నిందితుడిని దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. 

గతేడాది నవంబరు 10న ఈ ఘటనపై కేసు నమోదవ్వగా.. కీలక నిందితుడిని పోలీసులు ఆంధ్రప్రదేశ్‌లో పట్టుకున్నట్లుగా సమాచారం అందుతోంది. బ్రిటిష్ మోడల్ తార జారా పటేల్‌ వీడియోకు నటి రష్మిక ఫేస్ పెట్టిన డీప్‌ఫేక్ క్రియేటర్ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి అనేలా వార్తలు వస్తున్నాయి. ఆ వ్యక్తి పూర్తి వివరాలు అయితే తెలియలేదు కానీ.. ఆ వ్యక్తిని దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా అయితే డీసీపీ హేమంత్‌ తివారీ ప్రకటించారు.

ఆ వ్యక్తితో పాటు కీలక ఆధారాలు కూడా లభించినట్లుగా తెలుస్తోంది. గతేడాది బయటికి వచ్చిన రష్మిక వీడియోతో టెక్నాలజీపై అందరిలో భయం నెలకొంది. ఈ వీడియోపై రష్మిక కూడా ఆవేదన వ్యక్తం చేసింది. రష్మిక ఆవేదనతో చేసిన పోస్ట్‌కు అందరి మద్దతు లభించింది. ఆ తర్వాత బాలీవుడ్‌కి చెందిన కొందరు హీరోయిన్లు కూడా ఈ డీప్‌ఫేక్ బారిన పడ్డ విషయం తెలిసిందే.

Rashmika Mandanna Deep Fake Creator Arrested:

Delhi Police Arrested Rashmika Mandanna Deep Fake Creator  

Tags:   RASHMIKA DEEP FAKE
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ