ఘోస్ట్ మూవీ ప్లాప్ తర్వాత అక్కినేని నాగార్జున షూటింగ్స్ నుంచి చాలా గ్యాప్ తీసుకుని ఫైనల్ గా ఓ మలయాళ మూవీని తెలుగులో డాన్స్ మాస్టర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో నా సామిరంగ అంటూ మూడే మూడు నెలల్లో సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి ఆదరాబాదరాగా సంక్రాంతికి మూడు సినిమాలతో పోటీపడ్డారు. రొటీన్ స్టోరీనే అయినా.. నాగార్జున యాక్టింగ్, స్క్రీన్ ప్లే విజయ్ బిన్నీ డైరెక్షన్, కీరవాణి మ్యూజిక్ అన్నీ నా సామిరంగ చిత్రానికి హెల్ప్ అవడం, సంక్రాంతి సెలవులు కలిసిరావడంతో సినిమాని ప్రేక్షకులు బాగా ఆదరించారు. దానితో ఎనిమిదిరోజులు తిరిగేలోపులో నా సామిరంగ అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించింది. అదే విషయాన్ని మేకర్స్ అఫీషియల్ పోస్టర్ తో ప్రకటించారు.
నా సామిరంగ ఎనిమిది రోజుల కలెక్షన్స్ ఏరియాల వారీగా..
ఏరియా కలెక్షన్స్
👉Nizam: 4.68Cr
👉Ceeded: 3.52Cr
👉UA: 3.21Cr
👉East: 2.52Cr
👉West: 1.21Cr
👉Guntur: 1.39Cr
👉Krishna: 1.18Cr
👉Nellore: 82L
AP-TG Total:- 18.53CR(30.45CR~ Gross)
👉KA+ROI: 0.70Cr
👉OS: 0.55Cr
Total WW:- 19.78CR (33.45CR~ Gross)