Advertisementt

తండ్రయిన కుర్ర కామెడీ హీరో

Mon 22nd Jan 2024 03:31 PM
suhas  తండ్రయిన కుర్ర కామెడీ హీరో
Suhas and his wife Naga Lalitha has been blessed with a baby boy తండ్రయిన కుర్ర కామెడీ హీరో
Advertisement
Ads by CJ

హీరోలకి ఫ్రెండ్స్ పాత్రలతో, కామెడీ పాత్రలతో హైలెట్ అవుతూ.. తర్వాత సోలోగా హీరో పాత్రలు చేసి వరసగా హిట్స్ కొట్టిన నటుడు సుహాస్ ప్రస్తుతం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీతో ఫిబ్రవరి 2 న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. సుహాస్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం పై మంచి అంచనాలున్నాయి. సుహాస్ గత చిత్రాలు కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణం చిత్రాలు హిట్ అవడం, అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ చిత్ర ట్రైలర్ అన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి.

అయితే సుహాస్ ఈరోజు సోమవారం తండ్రయ్యాడు. ప్రొడక్షన్ నెంబర్ 1 అంటూ తనకు మెగా బిడ్డ పుట్టిన విషయాన్ని సుహాస్ సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్నాడు. సుహాస్ భార్య పేరు లలిత, సుహాస్ లలితల ఏడేళ్లు ప్రేమించుకున్నారు, వివాహానికి పెద్దలు నో చెప్పడంతో 2017 లో సీక్రెట్ గా వివాహంచేసుకున్న సుహాస్ ఆ తరవాత తరచూ భార్య లలిత తో కలిసి ఉన్న ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసేవాడు. ఇప్పుడు కూడా బిడ్డ పుట్టిన విషయాన్ని సుహాస్ తన బిడ్డ ఫేస్ రివీల్ చెయ్యకుండానే తెలియజేసాడు. 

Suhas and his wife Naga Lalitha has been blessed with a baby boy:

Actor Suhas and his wife Naga Lalitha has been blessed with a baby boy

Tags:   SUHAS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ