Advertisementt

అప్పుడే ఓటీటీలోకి మెర్రీ క్రిస్మస్

Thu 25th Jan 2024 12:07 PM
merry christmas  అప్పుడే ఓటీటీలోకి మెర్రీ క్రిస్మస్
Merry Christmas OTT Release Date And Platform అప్పుడే ఓటీటీలోకి మెర్రీ క్రిస్మస్
Advertisement
Ads by CJ

తమిళ-హిందీ భాషల్లో విజయ్ సేతుపతి-కత్రినా కైఫ్ జంటగా నటించిన మెర్రీ క్రిస్మస్.. నార్త్ ఆడియన్స్ కూడా మెచ్చేలా కొద్దిమార్పులు చేర్పులతో తమిళ, హిందీ భాషల్లో విడుదలైంది. థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన మెర్రీ క్రిస్మస్ పై ఆడియన్స్ లోను, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. జనవరి 12 న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులని అంతగా ఇంప్రెస్స్ చెయ్యలేకపోయింది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో ట్విస్ట్ లు ఆకట్టుకునేలా లేవు అంటూ ప్రేక్షకులు పెదవి విరిచారు

అయితే మెర్రీ క్రిస్మస్ మూవీని ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ రేటు కి ఓటిటి రైట్స్ ని సొంతం చేసుకుంది. 60 కోట్లు భారీ డీల్ తో మెర్రీ క్రిస్మస్ ని నెట్ ఫ్లిక్స్ దక్కించుకోగా.. ఇప్పుడు ఈ చిత్రం నెల తిరక్కుండానే ఓటిటి స్ట్రీమింగ్ అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఫిబ్రవరి 9 న మెర్రీ క్రిస్మస్ ఓటిటీ ఆడియన్స్ ముందుకు వచ్చే ఛాన్స్ వుంది అంటున్నారు, లేదు అంటే ఫిబ్రవరి 16 న కానీ మెర్రీ క్రిస్మస్ ఓటిటి రిలీజ్ ఉండొచ్చని సోషల్ మీడియా టాక్. 

Merry Christmas OTT Release Date And Platform:

Merry Christmas OTT Release Date details

Tags:   MERRY CHRISTMAS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ