Advertisementt

చరణ్ పై ఈర్ష్యగా ఉంటుంది: ఉపాసన

Wed 07th Feb 2024 07:23 PM
klin kaara  చరణ్ పై ఈర్ష్యగా ఉంటుంది: ఉపాసన
Upasana expresses being jealous of Ram Charan చరణ్ పై ఈర్ష్యగా ఉంటుంది: ఉపాసన
Advertisement
Ads by CJ

రామ్ చరణ్-ఉపాసన ప్రేమించుకునిపెద్దల అంగీకారంతో పదకొండేళ్ల క్రితం  వివాహం చేసుకున్నారు. ఉపాసన.. కామినేని ఇంటి నుంచి కొణిదెల ఇంటికి వచ్చినా.. ఆమె అటు పుట్టింటి, ఇటు అత్తింటి బాధ్యతలను నిర్వహిస్తుంది. మెగా కోడలిగా తన బాధ్యతలను పర్ఫెక్ట్ గా నిర్వహిస్తున్న ఉపాసన కి భర్త రామ్ చరణ్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఇద్దరూ తమ తమ వీలుని బట్టి వెకేషన్స్ ప్లాన్ చేసుకుంటారు. ఇక 11 ఏళ్ళ తర్వాత ఈ జంట ఓ పాపకి జన్మనిచ్చింది. తాజాగా ఉపాసన తన తాత ప్రతాప్ రెడ్డి బర్త్ డే వేడుకల్లో పాల్గొంది. అందులో భాగంగా ఓ మీడియా తో మట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

తమ కుమార్తె క్లింకార ని చరణ్ కంటికి రెప్పలా చూసుకుంటాడు, నేను బయటికి వెళితే చరణ్ క్లింకారని చూసుకుంటాడు, చరణ్ బయటికి వెళ్ళినప్పుడు నేను చూసుకుంటాను, అప్పుడప్పుడు చరణ్ ని చూస్తే ఈర్ష్యగా ఉంటుంది. అమ్మాయిలు తండ్రి కూచి అంటారు కదా.. అలానే క్లింకార చరణ్ ని చూడగానే కను రెప్పలు ఆడిస్తూ మొహం వెలిగిపోతుంది. అది చూస్తే నాకు ఈర్ష్యగా అనిపిస్తుంది. పాపని చరణ్ చాలా కేరింగ్ గా చూసుకుంటాడు. చరణ్ నాకు భర్త మాత్రమే కాదు ఫ్రెండ్ కూడా.. అన్నీ నాతో షేర్ చేసుకుంటాడు.

ఇక సినిమాల్లో చరణ్ హీరోయిన్ తో కొన్ని సీన్స్ చేసినప్పుడు ఏంటిది అని అడిగేదానిని. అది సినిమా, దర్శకుడు ఏం చెబితే అది చెయ్యాలి, నువ్వే అర్ధం చేసుకోవాలి అంటాడు చరణ్. సరేలే అని వదిలేసేదాన్ని. ఏదో చరణ్ ని ఆటపట్టించడానికి అడుగుతాను కానీ.. చరణ్ ఏ హీరోయిన్ తో చేసినా నేను పట్టించుకోను. హీరోయిన్స్ తో కన్నా నాతోనే చరణ్ కెమిస్ట్రీ బావుంటుంది అంటూ ఉపాసన చరణ్ విషయాలను షేర్ చేసుకుంది. 

Upasana expresses being jealous of Ram Charan:

Upasana expresses being jealous of Ram Charan and Klin Kaara

Tags:   KLIN KAARA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ