ఆంధ్రలో వైస్సార్ బిడ్డ షర్మిల కి ఆదరణ పెరుగుతుందా.. నిజమే పెరుగుతుంది. వైస్సార్ ని ఆదరించినట్టుగానే ఆయన కొడుకు జగన్ ని అక్కున చేర్చుకుని సీఎం ని చేసినట్టే.. ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల అడుగువేసిన ప్రతిసారి వేలాదిమంది ప్రజలు తమ మద్దతుని తెలుపుతున్నారా అనేలా ఆమె సభలకి జనాలు హాజరవవుతున్నారు. అన్న మీద కోపంతో తెలంగాణాలో పార్టీ పెట్టి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ తన వాయిస్ వినిపించిన షర్మిల ఎన్నికల ముందు కాంగ్రెస్ లో తన పార్టీని కలిపేసింది. ఆ తర్వాత కొన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న షర్మిల ఆంధ్రలో అడుగుపెట్టింది.
అక్కడ ఆంధ్రలోకి కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అడుగుపెట్టిన షర్మిల అన్న జగన్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ తన ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తుంది. షర్మిల కొడుకు పెళ్ళికి తేదీ దగ్గరపడుతున్న ఏపీలో ప్రజల్లోకి వెళ్లేందుకు సభలు నిర్వహిస్తుంది. జగన్ రెడ్డిపై దూకుడు ప్రదర్శిస్తూనే టీడీపీపైనా ఆరోపణలు చేస్తుంది. బీజేపీ అందులోను మోడీపై కూడా నిర్భయంగా ఆరోపణలు చేస్తుంది. అయితే ఏపీ ప్రజల్లో జగన్ పై ఉన్న అపనమ్మకమో.. లేదంటే మరేదన్నానో కానీ.. షర్మిల సభలకి అశేష జనవాహిని హాజరవుతుంది. నిన్న తునిలో షర్మిల సభకు హాజరైన జనం చూస్తే రాజశేఖర్ బిడ్డకి ఏపీ ప్రజలు అండ అనేలా కనిపించింది.
ఆమె ఎక్కడ సభ పెట్టినా ప్రజలు బాగా సపోర్ట్ చేస్తున్నారు. మరి ఈలెక్కన షర్మిల తన పట్టు బిగిస్తే.. వైస్సార్సీపీ ఓట్లు చీల్చడం ఖాయంగా కనిపిస్తుంది. వైస్సార్సీపీ ఓట్లు కాంగ్రెస్ కి పడినా ఆశ్చర్యం లేదు. షర్మిల ఏపీలో అడుగుపెట్టింది మొదలు అలుపెరగని పోరాటానికి నాంది పలికినట్లుగా ఆమె అడుగులు వేస్తుంది. మరి షర్మిల ప్రభావంతో ఏపీలో కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ఎంతవరకు కోలుకుంటుందో చూద్దాం.