రవితేజ టైగర్ నాగేశ్వరావు ప్యాన్ ఇండియా మూవీతో నార్త్ ఆడియన్స్ ని గట్టిగానే టార్గెట్ చేసాడు. ఆ చిత్రం ప్రమోషన్స్ ని కూడా ముంబై వేదికగా ధనాధన్ లాడించాడు. కానీ టైగర్ నాగేశ్వరావు మాత్రం రవితేజని బాగా డిస్పాయింట్ చేసింది. డిసాస్టర్ రిజల్ట్ ని కట్టబెట్టింది. తాజాగా రవితేజ ఈగల్ ని సహదేవ్ పేరిట హిందీలో రిలీజ్ చేసాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈగల్ మూవీ తెలుగు ప్రేక్షకులు, క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.
సహదేవ్ టైటిల్ తో నార్త్ లో రిలీజ్ చేయగా అక్కడ రెండు రోజుల రన్ ని ఈ చిత్రం కంప్లీట్ చేసుకుంది. ఈ రెండు రోజుల్లో ఈగల్ బిలో యావరేజ్ గానే పెర్ఫామ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. బుకింగ్స్ కూడా డల్ గా కనిపిస్తున్నాయి. చాలా ఏరియాల్లో సహదేవ్ బుకింగ్స్ నీరసంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈగల్ లోని యాక్షన్ సీన్స్ ని ప్రేక్షకులు బాగా మెచ్చుకున్నారు. హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయని కామెంట్స్ చేసారు. నార్త్ ఆడియన్స్ కి యాక్షన్ అంటే పిచ్చి.. అందుకే హిందీలో ఈగల్ ని ఇంకా అగ్రెసివ్ గా ప్రమోట్ చేసి ఉంటే బాగుండేది.. అనే అభిప్రాయాలను రవితేజ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.