Advertisementt

ప్రభాస్, ప్రశాంత్‌ల శౌర్యంగ పర్వం షురూ

Tue 13th Feb 2024 07:06 PM
prabhas salaar 2  ప్రభాస్, ప్రశాంత్‌ల శౌర్యంగ పర్వం షురూ
Change in Salaar Part 2 Plan ప్రభాస్, ప్రశాంత్‌ల శౌర్యంగ పర్వం షురూ
Advertisement
Ads by CJ

రెబల్ స్టార్ ప్రభాస్ ఆ మధ్య తన ఫ్యాన్స్‌కి.. ఇకపై ఏడాదికి రెండు సినిమాలు వచ్చేలా చూస్తానని మాట ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయన మాట ఇచ్చినట్లుగానే ఫ్యాన్స్‌కి రెండు సినిమాలు ఇచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ కల్కి 2898AD, ది రాజా సాబ్ చిత్రాల షూటింగ్స్‌తో బిజీగా ఉన్న ప్రభాస్.. ఈ సినిమాల తర్వాత యానిమల్ దర్శకుడు సందీప్‌తో చేయాల్సిన స్పిరిట్‌తో బిజీ అవుతాడనేలా టాక్ వినబడుతుండగా.. ఈ లైనప్‌లో కాస్త ఛేంజ్ ఏర్పడినట్లుగా తెలుస్తోంది.

కల్కి 2898AD, ది రాజా సాబ్ చిత్రాల తర్వాత స్పిరిట్ చిత్రం సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉండగా.. ఆ స్థానంలో సలార్ శౌర్యంగ పర్వాన్ని అదే సలార్ పార్ట్ 2 చిత్రీకరణలో ప్రభాస్ పాల్గొంటారని తెలుస్తోంది. ఎందుకంటే, సలార్ పార్ట్ 1కి వచ్చిన ఆదరణ చూసిన దర్శకుడు ప్రశాంత్ నీల్.. వెంటనే పార్ట్ 2ని కూడా తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నారట. వాస్తవానికి వేరే హీరోతో ఇంకో సినిమా చేసిన తర్వాత సలార్ పార్ట్ 2 ఉంటుందని ఇంతకు ముందు ప్రశాంత్ నీల్ చెప్పారు. కానీ ఇప్పుడు తన నిర్ణయం మార్చుకుని తదుపరి ప్రాజెక్ట్‌గా సలార్ 2నే చేయాలని అనుకుంటున్నారట. 

ఈ విషయం ప్రభాస్‌కు చెప్పగా.. ప్రభాస్ కూడా ఓకే డార్లింగ్ అంటూ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది. ప్రస్తుతం సలార్ 2కి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని, శౌర్యంగ పర్వంలో ప్రభాస్‌ పార్ట్ బీభత్సంగా ఉంటుందనేలా అప్పుడే టాక్ మొదలైంది. అన్నీ పూర్తి చేసి.. వచ్చే వేసవికి సలార్ పార్ట్ 2ని థియేటర్లలోకి తీసుకురావాలనేది ప్రశాంత్ నీల్ ప్లాన్‌గా సినీ సర్కిల్స్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి.

Change in Salaar Part 2 Plan:

Prabhas Green Signal to Salaar 2 Shoot

Tags:   PRABHAS SALAAR 2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ