Advertisementt

ప్రభాస్ కల్కి నుంచి మరో లీక్

Fri 16th Feb 2024 10:15 AM
kalki 2898ad  ప్రభాస్ కల్కి నుంచి మరో లీక్
Another leak from Prabhas Kalki ప్రభాస్ కల్కి నుంచి మరో లీక్
Advertisement
Ads by CJ

ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చిత్రాలకే కాదు.. చాలామంది స్టార్ హీరోల సినిమాలకు లీకులు అనేవి మేకర్స్ ని తరచూ టెన్షన్ కి గురి చేస్తూనే ఉన్నాయి. ఉంటున్నాయి. అప్ డేట్స్ లేట్ అవుతున్న కొద్దీ ఈ లీకులు మరింతగా పెరిగిపోతున్నాయి. అసలు సినిమా నుంచి ఫస్ట్ లుక్ రాకముందే ఆ సినిమా నుంచి ఏదో ఒక పిక్ లీకై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ వైరల్ గా మారుతున్నాయి. తాజాగా ప్రభాస్ - నాగ్ అశ్విన్ కలయికలో ప్యాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న కల్కి 2898ఎడి చిత్రం మే 9 న విడుదలకు సిద్దమవుతుంది. 

ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ లో బిజీగా వున్న కల్కి నుంచి సూపర్ సోల్జర్స్ అలాగే మరో సన్నివేశం ఒకటి సోషల్ మీడియాలో లీక్ అయ్యి వైరల్ గా మారింది. దానితో ఈ లీక్స్ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతున్నప్పుడు ఇలాంటి లీకులు మేకర్స్ ని ఖచ్చితంగా ఇబ్బంది పెట్టేవే. ఎన్నో అంచనాలున్న కల్కి 2898ఎడి నుంచి ఇలాంటి లీకులు నిజంగా మేకర్స్ కి కునుకు కూడా రానివ్వవు. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ మెగా స్టార్ అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె, దిశా పఠానీలు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

Another leak from Prabhas Kalki:

Leaks giving sleepless nights to Kalki 2898AD

Tags:   KALKI 2898AD
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ