మెగాస్టార్ చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ కొణిదెల ప్రస్తుతం తన పిల్లలతో కలిసి సింగిల్ లైఫ్ ని లీడ్ చేస్తుంది. తల్లి తండ్రులతో కలిసి ఉంటున్న శ్రీజ కొణిదెల రెండో భర్త కళ్యాణ్ దేవ్ తో విడిపోయింది. ఫ్యామిలీ సపోర్ట్ తో తనని తాను ఓదార్చుకుంటూ పిల్లలతో కలిసి ఒంటరి ప్రయాణం స్టార్ట్ చేసింది. సోషల్ మీడియాలో ఎప్పుడు గుంభనంగా స్పందించే శ్రీజ కొణిదెల ఈసారి మాత్రం చాలా ఓపెన్ గా మాట్లాడింది. తన బలాన్ని కనుగొన్నానని.. కొత్త ప్రయాణం ప్రారంభమైందని చెబుతూ వర్కౌట్స్ చేస్తున్న పిక్ ని ఇన్స్టాలో షేర్ చేసింది.
యు ఆర్ యువర్ బెస్ట్ ఛీర్ లీడర్! అంటూ ఆ ఫోటోకి క్యాప్షన్ కూడా పెట్టింది. ఆ పిక్ లో శ్రీజ చెమటలు చిందిస్తూ కనిపించడం చూసిన నెటిజెన్స్ వర్కౌట్స్ చేస్తూ శ్రీజ తనని తాను మలుచుకుంటుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. నిజంగానే విడాకులు తీసుకున్నాక కుంగిపోతూ ఇంట్లోనే ఉండకుండా కుటుంభ సభ్యుల సహకారంతో శ్రీజ త్వరగానే కోలుకుని పిల్లలతో ఆనందంగా కనిపిస్తుంది. అటు కళ్యాణ్ దేవ్ కూడా సింగిల్ గానే కనిపిస్తున్నాడు. అప్పుడప్పుడు కూతురు నివిష్కతో కలిసి సరదాగా ఆడుకుంటూ లైఫ్ ని గడిపేస్తున్నాడు.