Advertisementt

టీడీపీలో కేశినేని నాని రేటెంత?

Sat 17th Feb 2024 02:16 PM
kesineni nani  టీడీపీలో కేశినేని నాని రేటెంత?
What is the Rate of Keshineni Nani in TDP టీడీపీలో కేశినేని నాని రేటెంత?
Advertisement
Ads by CJ

పార్టీ కండువాలు మార్చినంత ఈజీగా మాటలు మారుస్తున్నారు కొందరు నేతలు. నిన్న మొన్నటి వరకూ రాజకీయంగా ఓ స్థాయిలో నిలబెట్టిన పార్టీని.. ఆ పార్టీ అధినేతను ఇష్టానుసారంగా కేశినేని నాని తూలనాడారు. దశాబ్ద కాలంగా ఎంపీగా టీడీపీ తరుఫున పార్లమెంటులో అడుగు పెట్టారు. ఇక తన నియోజకవర్గంలోనూ ప్రజల మద్దతు కూడగట్టుకున్నారు. అలాంటి కేశినేని నాని టికెట్ ఇవ్వననగానే ఏరు దాటాక తెప్ప తగలేసినట్టు.. వ్యక్తిగత విమర్శలకు సైతం వెనుకాడటం లేదు. వైసీపీ నీళ్లు కొద్ది రోజులకే బాగా వంటబట్టినట్టు ఉన్నాయి. ఏం చేస్తారు పాపం.. పూర్తిగా కొడాలి నానిలా మారిపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఆయన కుమారుడు లోకేష్‌పై ఇష్టానుసారంగా విమర్శలు గుప్పించారు. 

ఎంతకు కొనుక్కున్నారు?

చంద్రబాబు, లోకేష్‌ టీడీపీలో సీట్లు అమ్ముకుంటున్నారట. ఆ వచ్చిన డబ్బుతో ఎన్నికలు పూర్తవగానే పక్క రాష్ట్రం పారిపోతారంటూ ఎద్దేవా చేస్తున్నారు. పైగా జగన్‌ను చూసి చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలట.. అదీ కాదంటే సిగ్గు పడాలట. జగన్.. పేదలకు టికెట్ ఇస్తున్నాడట. తండ్రీకొడుకులిద్దరూ కలిసి టికెట్లు అమ్ముకుంటున్నారట. అసలు నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుందన్నట్టుగా ఉంది కేశినేని నాని తీరు. మరి అలా టికెట్లు అమ్ముకుంటున్న వారు వాళ్లైతే.. పదేళ్లుగా వాళ్ల దగ్గర కేశినేని నాని కూడా కొనుక్కుంటున్నట్టే కదా? ఈయన ఆ సీటును ఎంతకు కొనుక్కున్నారు? వాళ్లు ఎంతకు అమ్మారు? టీడీపీలో కేశినేని నాని రేటెంత? అని నేరుగానే ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సమాధానం చెబుతారా? జగన్ టికెట్ ఇచ్చిన వారిలో ఆ నిరుపేద ఎవరో చూపించగలరా? అంటే ఏం చెబుతారని టీడీపీ ప్రశ్నిస్తోంది.

రాష్ట్రంతో మూడు ముక్కలాట ఆడనందుకా?

అసలు జగన్‌ని చూసి చంద్రబాబు సిగ్గుపడటమేంటి? అంత సిగ్గుమాలిన పని చంద్రబాబు ఏం చేశారని? రాజకీయ లాభం కోసం బాబాయిని ఏమైనా హత్య చేయించారా? లేదంటే తాను కత్తితో పొడిపించుకున్నారా? అదీ కాదంటే.. తల్లీ, చెల్లి అన్న తేడా లేకుండా పార్టీ నేతలను పురమాయించి మాటల దాడి చేయిస్తున్నారా? లేదంటే సోషల్ మీడియా వేదికగా.. చెల్లెళ్లను చంపేస్తామంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారా? రాష్ట్రంతో మూడు ముక్కలాట ఆడనందుకా? హైదరాబాద్ నాల్గవ రాజధాని అననందుకా?.. అని టీడీపీ నేతలు కేశినేని నానిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. చివరకు కేశినేని వ్యాఖ్యలపై ఆయన సోదరుడు కేశినేని చిన్ని సైతం మండిపడుతున్నారు. కేశినేని నాని వసూలు రాజా అని.. జగన్ వద్ద.. వైసీపీ ఇన్‌చార్జుల వద్ద కేశినేని నాని పాలేరు పని చేస్తున్నారని.. ఆయనది సైకో మనస్తత్వమని కేశినేని చిన్ని మండిపడ్డారు.

What is the Rate of Keshineni Nani in TDP:

Kesineni Nani Sensational Comments On Chandrababu and Lokesh

Tags:   KESINENI NANI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ