Advertisementt

పుష్ప 3 నేపథ్యం అదేనా?

Mon 19th Feb 2024 09:51 PM
pushpa 3  పుష్ప 3 నేపథ్యం అదేనా?
Is this Pushpa 3 backdrop? పుష్ప 3 నేపథ్యం అదేనా?
Advertisement
Ads by CJ

పుష్ప ద రైజ్ కి సీక్వెల్ గా పుష్ప ద రూల్ తెరకెక్కుతుండగా.. ఇప్పుడు దానికి సీక్వెల్ గా పుష్ప 3 ఉంటుంది అంటూ మేకర్స్ నుంచి వస్తున్న స్పాయిలర్స్ తో అల్లు ఫాన్స్ తెగ ఎగ్జైట్ అవుతున్నారు. అల్లు అర్జున్-సుకుమార్లు పుష్ప 1 తో ప్యాన్ ఇండియా ని షేక్ చేసారు. ఇంటిపేరు కూడా లేని వాడు కండ బలంతో కసితో ఎర్ర చందనం స్మగ్లర్ గా ఎలా ఎదిగాడు, ఆ క్రమంలో ఎంతమందిని తొక్కి.. ఎంతమందిని శత్రువులుగా మార్చుకున్నాడో అనేది పుష్ప పార్ట్ 1 లో చూపించగా.. పార్ట్2 లో భన్వర్ సింగ్ షెకావత్(ఫహద్ ఫాసిల్) తో పెట్టుకున్న పుష్పరాజ్ అతని నుంచి ఎలా గెలిచాడో అనేది సుకుమార్ చూపించబోతున్నాడు.

మరి పుష్ప పార్ట్ 3 లో ఏం చూపిస్తారు, అసలు దీని నేపథ్యం ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు అల్లు ఫాన్స్ లో నడుస్తున్న ఆసక్తికర అంశం. అయితే పుష్ప 3 కథని జపాన్ బ్యాక్ డ్రాప్ లో సుకుమార్ రెడీ చేసుకుంటున్నట్లు వార్తలు పుట్టుకొచ్చాయి. రీసెంట్ గా బన్నీ జర్మనీలో జరుగుతున్న బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు చీఫ్ గెస్ట్ గా హాజరై ఈరోజే (సోమవారం)హైదరాబాద్ కి చేరుకున్నాడు. దానితో పార్ట్ 3 లో జర్మనీ నేపథ్యం ఉండబోతుంది అంటున్నారు. ఆర్ఆర్ఆర్, బాహుబలి మూవీలకు జపాన్ మార్కెట్ లో సూపర్ క్రేజ్ లభించింది. అందుకే పుష్ప3ను జపాన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు.

మరి పుష్ప పార్ట్ 2 ని త్వరగా చిత్రీకరించి పోస్ట్ ప్రొడక్షన్ కి వెళ్లాలని సుకుమార్-అల్లు అర్జున్ చూస్తున్నారు. ఎందుకంటే ఆగస్టు 15 న ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా మార్కెట్ లో దించేందుకు తేదీని కూడా ప్రకటించి ఉన్నారు.

Is this Pushpa 3 backdrop?:

Pushpa 3 having this backdrop  

Tags:   PUSHPA 3
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ