Advertisementt

బాబుకు జన్మనిచ్చిన నిఖిల్ భార్య

Tue 12th Mar 2024 10:50 AM
nikhil baby boy  బాబుకు జన్మనిచ్చిన నిఖిల్ భార్య
Nikhil and Pallavi Turns Parents బాబుకు జన్మనిచ్చిన నిఖిల్ భార్య
Advertisement
Ads by CJ

నిఖిల్ భార్య పల్లవి.. పండంటి బాబుకు జన్మనిచ్చారు. కొద్ది రోజుల క్రితం తన భార్యకు సీమంతం జరిగినట్లుగా ఓ ఫొటో షేర్ చేసిన నిఖిల్.. త్వరలో మేము తల్లిదండ్రులం కాబోతున్నామని ప్రకటించారు. ఆ తర్వాత పుట్టబోయే బిడ్డ కోసం డైపర్ క్లాస్‌లు నేర్చుకుంటున్నట్లుగా తన ఫ్రెండ్స్‌తో కలిసి ఉన్న ఫొటోని షేర్ చేసి.. తండ్రిగా తన బాధ్యతలను తెలుసుకుంటున్నట్లుగా ప్రకటించారు. దీంతో.. నిఖిల్, పల్లవి దంపతులు ఎప్పుడెప్పుడు పేరెంట్స్‌గా ప్రమోషన్ పొందుతారా? అని అంతా ఎదురు చూస్తుండగా.. పల్లవి ఓ బాబుకు జన్మనిచ్చినట్లుగా తాజాగా ఓ ఫొటోను విడుదల చేశారు.

ఈ ఫొటోలో తమ బిడ్డను నిఖిల్ చేతుల్లోకి తీసుకుని ముద్దాడుతున్నారు. తండ్రిగా ప్రమోషన్ పొందిన సంతోష క్షణాలను ఆయన అనుభవిస్తున్నట్లుగా ఈ ఫొటో చూస్తుంటే తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది. సినిమా విషయాలకు వస్తే.. మొదటి నుండి వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నిఖిల్.. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా మారారు. 

ఆయన హీరోగా చేసిన కార్తికేయ 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆదరణను పొందడంతో పాటు.. పలు అవార్డులను సైతం సొంతం చేసుకుంది. ప్రస్తుతం స్వయంభు అనే చిత్రంతో మరోసారి తన ప్రతిభను చాటేందుకు నిఖిల్ రెడీ అవుతున్నారు. త్వరలోనే కార్తికేయ 3 సినిమా కూడా ఆయన నుండి రానుంది.

Nikhil and Pallavi Turns Parents:

Nikhil and Pallavi are now Blessed with a Baby Boy

Tags:   NIKHIL BABY BOY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ