Advertisementt

ఓటిటిలోకి వచ్చేస్తున్న యాత్ర 2

Sun 25th Feb 2024 08:07 PM
yatra 2  ఓటిటిలోకి వచ్చేస్తున్న యాత్ర 2
Yatra 2 OTT streaming partner and release details ఓటిటిలోకి వచ్చేస్తున్న యాత్ర 2
Advertisement
Ads by CJ

YS రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా తెరకెక్కిన యాత్ర చిత్రం 2019 ఎన్నికల ముందు విడుదలై ఏపీ లో ప్రభంజనం సృష్టించింది. ఈ చిత్రం జగన్ సీఎం అవ్వడానికి బాగా హెల్ప్ అయ్యింది. మహి వి రాఘవన్ దర్శకత్వంలో మమ్ముట్టి రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటించిన యాత్రకి సీక్వెల్ గా వచ్చిన యాత్ర 2 లో యాక్టర్ జీవా జగన్ కేరెక్టర్ లో కనిపించాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 8 న విడుదలైంది. వైసీపీ అనుకూల మీడియా యాత్ర 2 హిట్ అని, ఎల్లో మీడియా యాత్ర 2 ఫట్ అని ప్రచారం చేసాయి. అయితే ప్రేక్షకుల నుంచి ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.

ఈ చిత్ర డిజిటల్ హక్కులని ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో ఫ్యాన్సీ ధరకు దక్కించుకుంది. యాత్ర 2 థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లుగా సమాచారం ఉంది. ఈ యాత్ర 2 సినిమా ఫిబ్రవరి 8వ తేదీన థియేటర్స్ లో విడుదలైంది. అయితే థియేటర్స్ లో పెద్దగా పెర్ఫర్మ్ చేయలేకపోయిన యాత్ర 2 ని మార్చి 2వ వారం నుంచే స్ట్రీమింగ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ వారంలోనే ఆ విషయంలో అఫీషియల్ అనౌన్సమెంట్ వస్తుంది అని సమాచారం.

Yatra 2 OTT streaming partner and release details:

Yatra 2 OTT date details

Tags:   YATRA 2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ