Advertisementt

రామాయణ్‌: రణబీర్-సాయి పల్లవి-యష్ ఫిక్స్

Sat 02nd Mar 2024 04:16 PM
ramayan  రామాయణ్‌: రణబీర్-సాయి పల్లవి-యష్ ఫిక్స్
Here is Ramayan triology cast రామాయణ్‌: రణబీర్-సాయి పల్లవి-యష్ ఫిక్స్
Advertisement
Ads by CJ

బాలీవుడ్ లో తెరకెక్కనున్న ప్రస్టేజియస్ ప్రాజెక్ట్ రామాయణ్‌ పై అందరిలో అంచనాలు పెరుగుతున్నాయి. దంగల్‌ దర్శకుడు నితీష్‌ తివారీ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నాడు. ఇప్పటికే రామాయణ్‌కు సంబంధించి నటీనటుల ఎంపిక జరుగుతోంది. అందులో రాముడి పాత్ర కోసం రణబీర్ కపూర్, సీత పాత్ర కోసం నేచురల్ బ్యూటీ సాయి పల్లవి, రావణాసుర పాత్ర కోసం యష్ ఎంపిక పూర్తయినట్లుగా సమాచారం. 

అంతేకాకుండా రామాయణంలోని ప్రధాన పాత్రల్లో ఒకటైన విభీషణుడి పాత్రలో నటించేందుకు విజయ్ సేతుపతికి ఆఫర్ వచ్చినట్లు సమాచారం. సూర్పనఖ పాత్ర కోసం గ్లామర్ డాల్ రకుల్ ప్రీత్ ని సంప్రదించారని న్యూస్ నడుస్తుంది. బాబీ డియోల్ ని కుంభకర్ణ పాత్ర కోసం ఎంపిక చేసారని అంటున్నారు. లారా దత్తాని కైకేయి పాత్ర కోసం దర్శకుడు తీసుకున్నారని తెలుస్తోంది. రాముడి సోదరుడు లక్షణుడి పాత్ర కోసం తెలుగు నటుడు నవీన్ పోలిశెట్టి ఎంపిక ఆల్మోస్ట్ పూర్తయ్యింది అనే వార్తలూ చూసాము.

హనుమంతుని పాత్ర కోసం సన్నీ డియోల్ ని ఎంపిక చెయ్యగా.. అర్జున్ గోవిల్ ని దశరధ్ పాత్ర కోసం సంప్రదించినట్లుగా  తెలుస్తుంది. మరి నటుల ఎంపిక పూర్తయిన ఈ చిత్రాన్ని మార్చి నెల చివరి వారం నుంచి పట్టాలెక్కించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారట. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణ్‌ ని భాగాలుగా భాగాలుగా విడుదల చేస్తారని సమాచారం.

Here is Ramayan triology cast:

Exciting details of Ramayan triology cast

Tags:   RAMAYAN