Advertisementt

జల్సాల కోసం దొంగతనం: నటి అరెస్ట్

Mon 04th Mar 2024 04:12 PM
actress soumya shetty  జల్సాల కోసం దొంగతనం: నటి అరెస్ట్
Actress Soumya Shetty arrested జల్సాల కోసం దొంగతనం: నటి అరెస్ట్
Advertisement
Ads by CJ

చాలామంది నటులు వెండితెర మీద, బుల్లితెర మీద వెలిగిపోదామని కలలు కంటారు. ఒకటో రెండో సినిమాలు చేసి ఆ మేకప్ కి అలవాటు పడిపోయి, కొద్ది డబ్బు రాగానే జల్సాలకు బానిసలుగా మారతారు. నలుగురిలో కనిపించేందుకు మోడ్రెన్ బట్టలు, చెప్పులు, మేకప్ ఖర్చు అంటూ మితిమీరిఖర్చు పెడతారు. చేతిలో పని ఉంటే ఓకె.. లేదంటేనే అసలు కష్టాలు. అలాంటి సమయంలో దొంగతనాలు, లేదంటే మత్తుకి బానిసలుగా మారిపోయి తప్పులు చేస్తూ ఉంటారు.

ఇలానే ఇప్పుడొక నటి జల్సాల కోసం దొంగతనం చేసి జైలు పాలయ్యింది. ది ట్రిప్‌, యువర్స్‌ లవింగ్ లీ నటించిన సౌమ్య శెట్టి స్నేహతురాలి ఇంట్లో బంగారం దొంగతనం చేసి పోలీసులకి పట్టుబడింది. వైజాగ్ లోని ప్రసాద్ అనే రిటైర్డ్‌ పోస్టల్ ఉద్యోగి కుటుంబంకు సౌమ్య తో గత కొన్నాళ్లుగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రసాద్ కుమార్తె తో సౌమ్య శెట్టి ఫ్రెండ్షిప్ చేస్తూ.. వాళ్ళ ఇంటికి వస్తూ పోతూ ఉండడమే కాకుండా.. వచ్చిన ప్రతిసారి బాత్ రూమ్ యూస్ చేసుకుంటాను అంటూ బెడ్ రూమ్ వాష్ రూమ్ వాడుకుంటూ వాళ్ళింట్లో దాదాపుగా 750 గ్రాముల బంగారం ను సౌమ్య శెట్టి దొంగిలించింది.

ఇలా ఒక్కసారి కాదు.. పలుమార్లు దొంగతనం చేస్తూ 750 గ్రాముల బంగారంను ఆమె దొంగిలింది. ఆ తర్వాత సౌమ్య శెట్టి గోవాకి చెక్కేసి జల్సాలు చేస్తూ ఎంజాయ్ చేస్తుందట. ప్రసాద్ కి అనుమానం రావడంతో ఆయన పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా పోలీసులు మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా ఆమెని గోవాలో అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. సౌమ్య తాను చేసిన దొంగతనం పోలిసుల ఎదుట ఒప్పుకుందని.. ఆమె బంగారం ను లలితా జ్యువెలరీ లో పాత బంగారం గా అమ్మేసి.. కొంత వరకు కొత్త నగలు చేయించుకుందట. 

కొంత బంగారం ను డబ్బు రూపంలోకి మార్చుకుని వాటితో ఆమె జల్సాలు చేసింది. గోవా కి వెళ్లి సౌమ్య అక్కడ జల్సాలు చేస్తూ ఉండడంతో పోలీసులు గుర్తించి ఆమెని అరెస్ట్ చేసినట్లుగా సమాచారం. జల్సాలకు అలవాటు పడిన సౌమ్య డబ్బు లేక పోవడంతో ఇలా దొంగతనం చేసింది అని పోలీసులు చెబుతున్నమాట.

Actress Soumya Shetty arrested:

Junior Actress Soumya Shetty arrested in gold theft case in Vizag

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ