Advertisementt

మార్చి 17న.. బుల్లితెర జాతర

Wed 13th Mar 2024 11:30 AM
march 17 sunday  మార్చి 17న.. బుల్లితెర జాతర
News Movie Hungama at Small Screen on March 17th మార్చి 17న.. బుల్లితెర జాతర
Advertisement
Ads by CJ

వారం వారం థియేటర్స్‌లో కొత్త సినిమాల జాతరతో బాక్సాఫీసు దగ్గర సందడి నెలకొంటే.. ఓటీటీల నుంచి ప్రతి వారం కొత్త సినిమాల స్ట్రీమింగ్, వెబ్ సీరీస్‌ల హడావిడి కనబడుతుంది. థియేటర్స్‌లో మిస్ అయిన చిత్రాలను నెలతిరిగే లోపు హాయిగా ఇంట్లోనే కూర్చుని ఓటీటీలలో వీక్షిస్తున్నారు ఆడియన్స్. మరి ఓటీటీ నుంచి మిస్ అయితే ఆ చిత్రాలు బుల్లితెర మీద ఎప్పుడు వస్తాయా అని ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారు.

అయితే ఓటీటీలు బాగా పాపులర్ అయ్యాక బుల్లితెర మీద సినిమాలు చూసే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. శాటిలైట్ హక్కులు కొన్న ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కూడా థియేటర్స్‌లో, ఓటీటీలలో విడుదలైన ఆరు నెలలకో, ఏడాదికో తీరికగా బుల్లితెర మీద ప్రసారం చేస్తున్నాయి. కానీ ఈసారి అలా కాదు. మార్చ్ 17న బుల్లితెర ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ లో కొత్త సినిమాల హోరు కనిపిస్తుంది. మార్చ్ 17 ఆదివారం సాయంత్రం జెమిని ఛానల్‌లో నాని-మృణాల్ ఠాకూర్ ల హిట్ చిత్రం హాయ్ నాన్న వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా రాబోతుంది.

ఇక మరో ఛానల్ జీ తెలుగు నుంచి షారుఖ్ ఖాన్-నయనతార‌ల జవాన్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారమవ్వబోతుంది. ఇక ఈటివి ఛానల్ నుంచి విక్టరీ వెంకటేష్ 75వ చిత్రం సైంధవ్ అదే ఆదివారం సాయంత్రం 7 గంటలకి ప్రసారమవుతున్నట్లుగా ప్రకటించారు. మరి ఈలెక్కన మార్చి 17 ఆదివారం బుల్లితెర జాతరని తలపించడం ఖాయంగా కనిపిస్తుంది.

News Movie Hungama at Small Screen on March 17th:

Saindhav, Jawan and Hi Nanna Ready to Small Screen Sensation

Tags:   MARCH 17 SUNDAY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ