ఈరోజు ఉదయం లేవగానే సోషల్ మీడియా ఓపెన్ చేసిన వారికి సింగర్ మజిలీ కి కారు ప్రమాదం, ఆమె కారుకి హైదరాబాద్-బెంగుళూరు హైవే పై ప్రమాదం జరగగా.. ఈ ప్రమాదంలో ముగ్గురుకి గాయాలైనట్టుగా వచ్చిన న్యూస్ చూసి అందరూ మంగ్లీకి ఎలా ఉందో అనే ఆందోళన పడ్డారు. సింగర్ మంగ్లీ కారు ని ఓ డీసీఎం వ్యాన్ ఢీ కొట్టడంతో కారుకి ప్రమాదం జరగ్గా.. కారులో ఉన్న మంగ్లీ తో పాటుగా మరో ఇద్దరికీ గాయాలైనట్టుగా చెప్పారు.
దీనితో యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు సింగర్ మంగ్లీకి కార్ యాక్సిడెంట్, ఆమె కండిషన్ సీరియస్, మంగ్లీ ప్రస్తుతం ఆసుపత్రిలో ఉంది అంటూ రకరకాల వార్తలు ప్రచారంలోకి తెచ్చారు. దానితో సింగర్ మంగ్లీ సోషల్ మీడియా వేదికగా తనకి జరిగిన ప్రమాదంపై రియాక్ట్ అయ్యింది. తనకు ప్రమాదం జరిగిన ఘటన రెండు రోజుల క్రితం జరిగింది. అనుకోకుండా జరిగిన ఈప్రమాదంలో చిన్న చిన్న గాయాలైనాయి. అంతే తప్ప తమకేమి కాలేదు.
నా యాక్సిడెంట్ పై వస్తున్నా రూమర్స్ ని నమ్మొద్దు, నా గురించి ప్ర్రదించిన వారికి నా కృతజ్ఞతలు అంటూ మంగ్లీ సోషల్ మీడియా ద్వారా ప్రమాదంపై స్పందించింది.