Advertisementt

ఉస్తాద్ భగత్ సింగ్ ఊపిరి పోసాడు

Tue 19th Mar 2024 05:18 PM
ustaad bhagat singh  ఉస్తాద్ భగత్ సింగ్ ఊపిరి పోసాడు
Ustaad Bhagat Singh is here ఉస్తాద్ భగత్ సింగ్ ఊపిరి పోసాడు
Advertisement
Ads by CJ

హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ ని ఉస్తాద్ భగత్ సింగ్ గా ఎలా చూపిస్తాడో అనే దానికి ఫస్ట్ లుక్ తోనే అభిమానులకి పిచ్చ క్లారిటీ ఇచ్చాడు. ఆ తర్వాత వదిలిన గ్లిమ్ప్స్ తో అందనంత హైప్ క్రియేట్ చేసాడు. పవన్ కళ్యాణ్ ని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా గబ్బర్ సింగ్ లోనే చూసిన అభిమానులకి ఈ ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ ని పోలీస్ ఆఫీసర్ గా ఇంకెంత కొత్తగా చూపిస్తాడో అనే ప్రశ్నకి నేడు వదిలిన భగత్స్ బ్లేజ్ తో పర్ఫెక్ట్ ఆన్సర్ ఇవ్వడమే కాదు.. హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ అభిమానుల ఆకలిని తీర్చేసాడు.

ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి భగత్స్ బ్లేజ్ అంటూ వదిలిన టీజర్ స్టార్టింగ్ లో పూజారులని హింసించే వారిని ఉతికి ఆరేస్తూ.. గాజు గ్లాస్ చూపిస్తూ ఇది నీ రేంజ్ అన్న రౌడీకి చుక్కలు చూపిస్తూ గాజు పగిలేకొద్దీ పదునెక్కుద్ది అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ కి పవన్ ఫాన్స్ కి పూనకాలే.. థియేటర్స్ లో అరుపులే.

పవన్ కళ్యాణ్ ఉగ్రరూపం చూపిస్తూ విలన్స్ ని చితక్కొడుతూ గన్స్ సౌండ్ తో ఖచ్చితంగా గుర్తుపెట్టుకో.. గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం, కనిపించని సైన్యం అంటూ పొలిటికల్ గా చెప్పిన డైలాగ్ కి థియేటర్స్ లో విజిల్స్ పడాల్సిందే, ఏపీలో పవన్ జనసేనకు ఓట్లు రాలాల్సిందే, దేవిశ్రీ ప్రసాద్ BGM అదనపు ఆకర్షణ కాగా.. పవన్ కళ్యాణ్ లుక్స్, ఆయన కేరెక్టర్ కి పవన్ ఫాన్స్ ఫిదా అవుతున్నారు. హరీష్ శంకర్ ని విమర్శించి, తిట్టిన వాళ్లే మా అన్న పవన్ బాగా చూపించావ్, ఉస్తాద్ తో పవన్ అన్న పొలిటికల్ కెరీర్ కి ఊపిరి పోసావ్ అంటూ తెగ పొగిడేస్తున్నారు.

Ustaad Bhagat Singh is here :

Ustaad Bhagat Singh is here with all guns firing

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ