Advertisementt

డూప్ లేకుండా చిరంజీవి రిస్కీ యాక్షన్

Thu 21st Mar 2024 11:05 AM
vishwambhara  డూప్ లేకుండా చిరంజీవి రిస్కీ యాక్షన్
Chiranjeevi risky action without dupe డూప్ లేకుండా చిరంజీవి రిస్కీ యాక్షన్
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి వయసుని అస్సలు లెక్కలోకి తీసుకోరు. ఆయన సినిమాల్లోకి కమ్ బ్యాక్ అయ్యాక బ్రేక్ తీసుకోకుండా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఏడాదిన్నర క్రితం మెగాస్టార్ నాలుగు చిత్రాల షూటింగ్స్ కోసం డే అండ్ నైట్ కష్టపడ్డారు. భోళా శంకర్ తర్వాత మోకాలి సర్జరీ వలన ఆరు నెలలు బ్రేక్ తీసుకుని ప్రస్తుతం విశ్వంభర షూటింగ్ కి అటెండ్ అవుతున్నారు. దర్శకుడు వసిష్ఠ విశ్వంభర యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్నారు,

మరి చాలామంది హీరోలు రిస్కీ షాట్స్ ని డూప్ సహాయంతో కానిచ్చేస్తారు. అందులోను 60 ప్లస్ ఉన్న చిరంజీవి ఇలాంటి డూప్స్ సహాయం తీసుకోవడం వింతేమీ కాదు. కానీ మెగాస్టార్ చిరు ఇప్పుడు విశ్వంభర లోని ఓ రిస్కీ యాక్షన్ సీక్వెన్స్ ని బురద నీటిలో డూప్ సహాయం లేకుండా చేస్తున్నారట. మరి వయసుని ఏమాత్రం లెక్క చెయ్యకుండా డాన్సులు, యాక్షన్ సీక్వెన్స్ అంటే ఓకె.. కానీ రిస్కీ షాట్స్ ని చిరు ఎలాంటి డూప్ లేకుండా చేయాలనుకోవడం ఆయన డెడికేషన్ కి నిదర్శనమనే చెప్పాలి.

వసిష్ఠ దర్శకతంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మెగాస్టార్ కి జోడిగా త్రిష నటిస్తుండగా.. సురభి, ఈషా చావ్లా లు ఈ చిత్రంలో కీ రోల్స్ పోషిస్తున్నారు. చిరు-వసిష్ఠ విశ్వంభర చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చెయ్యబోతున్నారు. 

Chiranjeevi risky action without dupe:

No Dupe For Chiru Vishwambhara

Tags:   VISHWAMBHARA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ